వైసీపీ, ఎన్డిఎలో చేరడం ఏమో గాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేగుతుంది. ఆ పార్టీ ఎన్డిఎలో చేరడంపై అధికార పార్టీలోనే భిన్న స్వరాలు వినపడుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఏదోక సందర్భంలో నిన్నటి నుంచి దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన నేపధ్య౦లో రాష్ట్రంలో వైసీపీ ఎన్డిఎలో చేరే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా వైసీపీ కార్యకర్తలు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నార్సీ సహా రాష్ట్రానికి అన్యాయ౦ చేస్తున్న ఎన్డియేలో వైసీపీ ఏ విధంగా చేరుతుంది అని ప్రశ్నిస్తున్నారు.

 

దీనిపై మంత్రులు ఒకరి తర్వాత ఒకరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్డియేలో వైసీపీ చేరేది ఉంటే మాత్రం ఏ విషయం అయినా సరే జగన్ చెప్తారని, అవి అన్నీ కేవలం పుకార్లు అని మంత్రి అనీల్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం వ్యాఖ్యానించారు. ఇక తాజాగా పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నానీ కూడా ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో వైసీపీ చేరేది లేనిదీ జగన్ నిర్ణయమే ఫైనల్ అంటూ కొడాలి నానీ కామెంట్స్ చేసారు. అలాంటిది ఏదైనా ఉంటే జగన్ నుంచి ప్రకటన వస్తుందని, ఎవరు ఎం మాట్లాడినా సరే పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసారు. 

 

హోదా ఇవ్వలేమని వేరే విధంగా సాయం చేస్తామని కేంద్రం చెప్తున్నట్టు కొడాలి నాని వ్యాఖ్యానించారు. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. మంత్రి బొత్సా సత్యనారాయణ వైసీపీ ఎన్డిఎలో చేరుతుందని వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో కొడాలి నానీ ఈ వ్యాఖ్యలు చేసారు. అక్కడి నుంచి దుమారం రేగింది. దీనితో వైసీపీ నేతలు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించడంతో, నష్టం జరగకముందే వైసీపీ మంత్రులు జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: