కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి ఇప్పటికీ నిరసన సెగలు తగులుతున్న  విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సహా ఎన్ఆర్సీని  వ్యతిరేకిస్తూ... దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో నిరసనలు చేసాయి . పలు రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం పై జరిగే నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీసాయి. ఇక ఇప్పటికి కూడా పౌరసత్వ  సవరణ చట్టంపై నిరసనలు  మాత్రం ఆగడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి సంబంధించి ఆసక్తికర చర్చ కొనసాగుతుంది . 

 

 తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి తెలంగాణ సర్కార్ వ్యతిరేకత తెలపాలని కేసీఆర్తో భేటీ అయి కోరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఆసక్తికరంగా మారింది.

 


 ఇకపోతే తాజాగా వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్  భాషా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం సహా ఎన్ఆర్సి పై కేంద్రం మొండిపట్టు తో ముందుకు వెళ్తే తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ భాష. ఎన్ఆర్సి ని  వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నామని ఆయన వెల్లడించారు. మైనార్టీలకు తీవ్ర ద్రోహం చేసే బిజెపి పార్టీలో తాము ఎప్పుడు కలువబోము  అంటూ తెలిపారు. అయితే బీజేపీతో కలిస్తే తప్పేముంది అని ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం అంజాద్ భాష వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: