పార్టీ అధినేతల మీద, ముఖ్యమంత్రుల మీద నాయకులకు మంత్రులకు అభిమానం ఉండటం అనేది సాధారణమైన విషయ౦. ముఖ్యంగా తమ అధినేతల మీద అభిమానం చాటుకోవడానికి లేదా స్వామి భక్తిని నిరూపించడానికి కొందరు మంత్రులు అప్పుడప్పుడు కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీలకు చెందిన నేతలు అయితే కాస్త అతి కూడా చేస్తూ ఉంటారు అనేది ఈ మధ్య స్పష్టంగా కొన్ని విషయాల్లో అర్ధమవుతుంది. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది కాస్త ఎక్కువైంది. 

 

ముఖ్యమంత్రుల మీద అభిమానం చాటుకోవడానికి శాసన సభా సమావేశాలు, మీడియా సమావేశాలు ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఎక్కువైంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. స్వామి భక్తిని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇంగ్లీష్ కోట్స్ ఎక్కువగా రావడంతో వాటి సహాయంతో నేతల మీద తమ ప్రేమను ఇస్తానని చాటే ప్రయత్నం చేస్తున్నారు. 

 

తాజాగా ఇలా చేసే ఒక తెలంగాణా మంత్రిగారు జరిమానా ఎదుర్కోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణా పశుసంవర్ధక శాఖా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నో సందర్భాల్లో కెసిఆర్ పై తన అభిమానాన్ని బయటపెట్టుకున్నారు. ఈ సారి కూడా అదే విధంగా ప్రయత్నాలు చేసి ఫైన్ ఎదుర్కొన్నారు. తన ఇంటి వద్ద we love kcr అంటూ కటౌట్ లు ఏర్పాటు చేసారు ఆయన. దీనితో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసారని ఆయనకు 5 వేల జరిమానా విధించారు అధికారులు. దీనితో ఈ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఎదిలా ఉన్నా అధికారులు ఇచ్చిన షాక్ తో ఖంగుతిన్నారు మంత్రి గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: