తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ స్థానాలు గెలవడం తో టీడీపీ పార్టీ క్యాడర్ మొత్తం ప్రస్తుతం అభద్రతాభావం లో ఉంది. కొన ఊపిరితో ఉన్నట్టు ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉంది టీడీపి. ఇటువంటి తరుణంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం స్టార్ట్ చేసింది. వచ్చే నెల 15 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు జనచైతన్య యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది.

 

జనచైతన్య యాత్ర తో జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలలో ఎండగట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి పరిపాలనలో ఉన్న లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా వ్యవహరించాలని చంద్రబాబు డిసైడ్ అవ్వడం జరిగింది. దాదాపు 45 రోజుల పాటు 'యాత్ర' చేయాలని భావించిన చంద్రబాబుకి సొంత పార్టీ నేతలే నాయనా చంద్రబాబూ నీకు చెయ్యెత్తి దండం పెడతాం...అధికారంలోకి వచ్చి వాళ్ళు సంవత్సరం అయింది ఇటువంటి యాత్రల వల్ల ప్రజలలో అబాసుపాలు అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారట.

 

ఇదే తరుణంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటి దాడులలో వస్తున్న ఆరోపణలకు సరైన క్లారిటీ ఇచ్చి అప్పుడు ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాగుంటుందని ఎన్నికలను ఎదుర్కోవచ్చు ప్రజలకు భరోసా ఇచ్చినట్లు ఉంటుందని టీడీపీ కార్యకర్తలు సూచిస్తున్నారట. ప్రస్తుతం ఐటి దాడుల విషయంలో వస్తున్న వార్తలను పార్టీ నుండి బలమైన నాయకుల చేత మీడియా ముందు ఖండించాలని కూడా టిడిపి పార్టీ పెద్దలకు కార్యకర్తలు సూచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా ప్రజల్లోకి వెళితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కనుమరుగవడం గ్యారెంటీ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: