ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అభిమానుల్లో ఎంతో సందడి  నెలకొని ఉంటుంది. ఇక ఐపీఎల్ వస్తే ఈ క్రికెట్ సందడి కాస్త డబుల్  అయిపోతూ ఉంటుంది. అప్పటివరకు దేశం కోసం ఒకే జట్టులో  కలిసి ఆడిన ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో వివిధ జట్లలో ప్రత్యర్థులు గా మారిపోయి తలబడుతుంటారు . క్రికెట్ కాస్త మరింత రసవత్తరంగా మారిపోతుంది.ఇక  ఐపీఎల్ లో అతి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఆర్సిబి. ఇప్పటి వరకు టైటిల్ గెలవకపోయిన  ఈ జట్టుకు మాత్రం అధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంటుంది. కాగా ఈ జట్టు కెప్టెన్గా భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నారు. 

 

 

 

 అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో  ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్  క్వాలిఫై కాలేకపోయింది... టైటిల్ దరికి  చేరలేక పోయింది.. ఈసారి ఐపీఎల్ ఆర్సిబి లో పలు కీలక మార్పులు చేయాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రొఫైల్ పిక్ ని డిలీట్ చేసి..నిన్న  కొత్త లోగోను విడుదల చేసింది. గర్జిస్తున్న సింహం ఆకారంలో ఈ కొత్త లోగో  ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. కాగా ఈ కొత్త లోగో  బాగుంది అంటూ పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. లోగో మార్చడమే కాదు పలు కీలక వ్యూహాలతో బరిలోకి దిగి ఈసారి ఎలాగైనా టైటిల్  గెలవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

 ఇకపోతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విడుదల చేసిన కొత్త లోగో పై పలువురు క్రికెటర్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకరైన  జస్ప్రిత్ బూమ్రా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లోగో ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. రాయల్  ఛాలెంజర్స్ బెంగుళూరు కొత్త లోగో  చాలా కూల్ గా ఉందని... లోగో గుర్తు తన బౌలింగ్ యాక్షన్ ను పోలి ఉంది అంటూ కామెంట్ చేశాడు. మరోవైపు ఆర్సిబి కొత్త లోగో పై మాజీ చైర్మన్ విజయ్ మాల్యా కూడా ఆసక్తికర కామెంట్ చేశారు. కొత్త లోగో  బాగుందని... లోగోలో  సింహం బాగా గర్జిస్తుందని ఈ సారి ఎలాగైనా  టైటిల్ గెలవాలి అంటూ  సూచించాడు విజయమాల్య.

మరింత సమాచారం తెలుసుకోండి: