జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పదవి  లేకుండానే ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరఫున అధికార పార్టీ నిలదీస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీతో కలిసి నడవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుందని దీనికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అయితే బీజేపీతో పొత్తు ఏర్పడి ఎన్నో రోజులు కానప్పటికీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ తీరుపై కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

 

 అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు... ఏపీ సర్కార్పై కేంద్రం సానుకూలంగా ఉండటం... అంతేకాకుండా వైసిపి ఎన్డీయేలో  కలవబోతున్నది అంటూ వార్తలు వస్తున్నాయి... కేంద్రంలోని పెద్దలు అందరూ ఏపీ సీఎం జగన్ తో వరుస భేటీలు అవుతుండడంతో... పవన్ కళ్యాణ్  బిజెపి ని దూరం పెడుతున్నట్లు సమాచారం.మొన్న  కర్నూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కూడా బీజేపీ నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ బీజేపీపై చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తిని రేపుతున్నాయి. 

 

 పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నార అంటే అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. అమరావతి పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ తీరును తప్పు పట్టారు. ఢిల్లీలోని బిజెపి నేతలు రాష్ట్రంలో బీజేపీ నేతలు మాట్లాడేదానికి అసలు సంబంధమే లేదని... వారిద్దరి మాటల వైరుధ్యాన్ని నేను బిజెపి హస్తిన పెద్దలు దృష్టికి తీసుకెళ్ళాను... అమరావతికి  కట్టుబడి ఉన్నామంటూ బిజెపి నేతలు చెప్పారు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే వైసీపీ సర్కార్ తాము చేస్తున్న వికేంద్రీకరణకు కేంద్ర మద్దతు ఉందని ప్రచారం చేసుకోవడం నమ్మొద్దని  అమరావతి రైతులకు సూచించారు. జగన్ సర్కార్ మాటలు నమ్మి కేంద్రం పెద్దలను నిందించ వద్దు అంటూ తెలిపారు. అయితే తన వెంట ఎవరు ఉన్నా లేకున్నా తాను మాత్రం  రైతులకు అండగా నిలబడతా అంటూ  జనసేనానీ  వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: