టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చాక  తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రయాణం  భారాన్ని తగ్గించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తర్వాత క్రమక్రమంగా ఒక్కో స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తు...  నగరవాసుల ప్రయాణం తగ్గిస్తూ వచ్చింది. అయితే పలుమార్లు విమర్శలు వచ్చినప్పటికీ మెట్రో ద్వారా ఎంతో మంది ప్రజలకు సులువైన ప్రయాణం దక్కుతుంది . రోజు లక్షలాది మంది హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పటికే పలు మార్గాల గుండా  మెట్రో సదుపాయాన్ని   ప్రారంభించిన తెలంగాణ సర్కార్ తాజాగా మరో  కారిడార్ ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు ప్రారంభించింది తెలంగాణ సర్కార్ . అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు స్టేషన్ ను ప్రారంభించారు. ఈ మార్గం గుండా మెట్రో రైలు ప్రారంభం కావడంతో ప్రయాణికులకు ప్రయాణం  మరింత సులువుగా మారిపోయింది.ఎందుకంటే  బస్సు ద్వారా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్కు చేరుకోవాలంటే గంట నుంచి గంటన్నర వ్యవధి పడుతూ ఉంటుంది కానీ.. మెట్రో రైల్లో ప్రయాణం చేయడం ద్వారా 30 నిమిషాల్లోనే గమ్యానికి చేరుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా పూర్తిగా ప్రయాణం సాగి పోతూ ఉంటుంది. 

 

 

 అయితే తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎంజీబీఎస్ జేబీఎస్ మెట్రో రైల్ పై  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్ ప్రారంభానికి తనను ఆహ్వానించక పోవడం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని తెలంగాణ సర్కార్ టిఆర్ఎస్ పార్టీ ఫంక్షన్ లా  మార్చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నుంచి మెట్రో నిర్మాణానికి 1200 కోట్ల రూపాయల నిధులు ఇస్తే కనీసం హోర్డింగ్ లలో  కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వేయించలేదు  అంటూ కిషన్రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో మరోసారి మెట్రో కోసం కేంద్రంని  నిధులు అడగవద్దు అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే మెట్రో వస్తే ఓల్డ్ సిటీ రూపురేఖలు మారిపోతాయి అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: