భూగ్రహం మీద మనుషులు, ఇతర జీవులు నివశిస్తున్నట్లుగానే విశ్వంలో ఏదో గ్రహంపై కూడా ప్రాణులు ఉన్నాయని ఆ ప్రాణులు మనతో పోలిస్తే చాలా తెలివైనవి అని అవి గ్రహాంతరవాసులు(ఏలియన్స్) అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. నేటికి విజ్ఞాన శాస్రం దగ్గర గ్రహాంతరవాసుల గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ భూమిపై ఉండే పరిస్థితులు, పరిణామం మరో చోట ఎక్కడైనా సంభవించి ఉంటే మాత్రం ఆ జీవులు కూడా ఉన్నతస్థాయి జీవులుగా ఎదిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతారు. 
 
కొందరు శాస్త్రవేత్తల బృందం గ్రహాంతరవాసుల గురించి తాజాగా కొన్ని పరిశోధనలు చేశాయి. ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు శాస్త్రవేత్తలకు తెలిశాయి. గతంలోనే ఈ శాస్త్రవేత్తల బృందం అంతరిక్షం నుండి రేడియో సిగ్నల్స్ వస్తున్నట్టు గుర్తించింది. ఈ బృందం ఈ రేడియో సిగ్నల్స్ ఎప్పుడుపడితే అప్పుడు వస్తాయని భావించేది. కానీ ఖచ్చితమైన గ్యాప్ తీసుకొని ప్రతి 16 రోజులకు ఒకసారి రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. 
 
చిన్న చిన్న తరంగాలుగా ఉండే ఈ రేడియో సిగ్నల్స్ ప్రకృతిలో చెల్లాచెదురుగా ఉంటాయి. కెనాడాలోని కొందరు పరిశోధకులు దాదాపు సంవత్సరంపాటు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో రేడియో సిగ్నల్స్ ప్రతి గంటకు భూమి వైపుకు వస్తున్నాయని అలా 16 రోజుల పాటు వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.                    
 
శాస్త్రవేత్తల బృందం ఈ రేడియో సిగ్నల్స్ గురించి మరిన్ని పరిశోధనలు చేసి అక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారా...? అనే విషయాన్ని కనిపెట్టే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఒక పద్దతి ప్రకారం రేడియో సిగ్నల్స్ రావడంతో గ్రహాంతరవాసులు ఉన్నారేమో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్నారా...? లేరా...? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మాత్రం ఆ ప్రశ్నకు భవిష్యత్తులోనే సమాధానం దొరకనుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: