బిజెపి, వైసీపీ పొత్తు పెట్టుకుంటే తనకు అభ్యంతరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి వైసీపీ కలిస్తే తప్పు లేదని కాని అక్కడ తాను ఉండను అంటూ ఆయన స్పష్టం చేసారు. అదే జరిగితే బిజెపితో తాను కలిసి నడవను అన్నారు పవన్. బిజెపి, వైసీపీ పొత్తు పెట్టుకుంటుంది అనేది కేవలం తప్పుడు ప్రచారం అని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రాజధాని పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసారు. రెండు రోజుల నుంచి వైసీపీ ఎన్డిఎలో చేరుతుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. 

 

ఈ నేపధ్యంలో ఇప్పటికే మంత్రులు వైసీపీ నేతలు దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు అది జరిగే అవకాశం లేదని, అది జరిగే అవకాశం ఉంటే నేరుగా జగన్ నుంచే అధికారిక ప్రకటన వస్తుంది అంటూ మంత్రులు అనీల్, కొడాలి నానీ ప్రకటించారు. దీనిపై బిజెపి కూడా స్పందించింది. అసలు అది జరిగే అవకాశం లేదని బిజెపి నేతలు కూడా అన్నారు. తాము జనసేన పార్టీ తో కలిసి వైసీపీ విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. రాజకీయంగా తాము ప్రత్యర్దులం అని భవిష్యత్తులో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్ట౦ చేసింది. 

 

ఈ నేపధ్యంలోనే వైసీపీ, బిజెపి పొత్తు పెట్టుకుని వైసీపీ ఎన్డిఎలో చేరితే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏంటీ అనే ప్రశ్నలు వినిపించాయి. ఆయన పొత్తు పెట్టుకుని నెల రోజులు కూడా కాక ముందే జగన్ చేసిన రాజకీయంతో పవన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన రాజకీయ ప్రయాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానించారు. దీనితో పవన్ స్పందించి ఆ వ్యాఖ్యలకు అనుమానాలకు చెక్ పెట్టారు. మూడు రాజధానులు అనేది ఉండదు అని కూడా పవన్ స్పష్టం చేసారు. ఏది ఎలా ఉన్నా వైసీపీ బిజెపి పొత్తు అనేది రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: