ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని అధికార వైసీపీ ప్రకటించింది. ఆయన పర్యటన సక్సెస్ అయిందని జగన్ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపిందని వైసీపీ వ్యాఖ్యానించింది. జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన నేపధ్యంలో స్పందించిన వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. మూడు రాజధానులు, మండలి రద్దు కి కేంద్రం హామీ ఇచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దు బిల్లు, పార్లమెంట్ రెండో సెషన్ లో ప్రవేశ పెట్టే అంశంపై పరిశీలనకు అంగీకారం తెలిపినట్టు వైసీపీ నేతలు ప్రకటించారు .

 

గత మూడు రోజుల నుంచి జగన్ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్ళిన జగన్ మూడు నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. ఈ సందర్భంగా ఆయన మండలి రద్దు సహా మూడు రాజధానుల విషయాన్ని ఆయనతో చర్చించారు. దీనికి మోడీ కూడా అంగీకారం తెలిపారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక హైకోర్ట్ తరలింపు విషయంలో కూడా కేంద్ర న్యాయశాఖ అంగీకారం తెలిపిందని వైసీపీ నేతలు అంటున్నారు. దీనితో త్వరలోనే హైకోర్ట్ ని అమరావతికి తరలించే విషయమై ప్రక్రియ మొదలుపెడతామని ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి. 

 

ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ సెషన్ లో మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనితో ఒక్కసారిగా టీడీపీకి షాక్ తగిలింది, ఇన్నాళ్ళు మండలి రద్దు విషయంలో కేంద్రం మద్దతు ఇచ్చే అవకాశం లేదని భావించిన చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్సీలకు ఒక్కసారిగా జగన్ తన ఢిల్లీ పర్యటనతో ఊహించని షాక్ ఇచ్చారు. దీనితో మూడు రాజధానులను కేంద్రం అంగీకరించడంతో త్వరలోనే విశాఖకు రాజధాని వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. మరి భవిష్యత్తులో ఎం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: