ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అమిత్ శాలను కలిసిన ఏపీ సీఎం జగన్ అనేక అంశాల గురించి చర్చించి క్లారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ భేటీలో జగన్, అమిత్ షా, మోడీ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే అనేక అంశాలపై క్లారిటీ తెచ్చుకున్న జగన్ తనకు అవసరమైన కొంత మంది అధికారులను కూడా కేంద్రం అనుమతితో ఏపీకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి కేటాయించవల్సిందిగా  జగన్ వారికి ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీఫెన్ రవీంద్రను రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించలని జగన్ భావించారు. 


 తెలంగాణలో ఉన్న ఆయనను ఏపీ తీసుకువచ్చేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. దీనిపై ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే జగన్ కేంద్రానికి ప్రతిపాదన పెట్టినా నిబంధనల మేరకు ఆయనను ఏపీకి పంపించే అవకాశం లేకపోవడంతో ఆ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ పక్కనపెట్టేసింది. ఇక స్టీఫెన్ రవీంద్ర కూడా కేంద్రం తనను ఏపీకి పంపిస్తుందనే ఆశతో చాలా కాలం వేచి చూశారు. ఇక ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించకపోవడంతో మళ్లీ తెలంగాణలోనే ఆయన విధుల్లో చేరి పోయారు.


ఇక ఆ తరువాత కేంద్రానికి, వైసీపీకి మధ్య అంతగా సానుకూల పరిస్థితులు లేకపోవడం, వైసీపీ టార్గెట్ గా కేంద్రం పావులు కదపడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆ విషయాన్ని అందరూ పక్కనపెట్టేశారు. కానీ ఇప్పుడు బీజేపీ అగ్రనేతలను జగన్ కలిసిన సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర విషయం మరోసారి జగన్ గుర్తుచేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.  ఒకవేళ అదే జరిగితే ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర ను నియమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కేంద్రం ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: