ఒకప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో అదును చూసి ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుండే వారని, ఆయన రాజకీయ చాణక్యత ముందు అందరూ ఇబ్బందులు పడేవారని చాలా ఏళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే జగన్ ఎంట్రీ ఇచ్చాక, చంద్రబాబు చాణక్యత పతనమైంది. జగన్ వ్యూహాలు ముందు బాబు చేతులెత్తేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు గానీ, ఆ తర్వాత గానీ జగన్ అదిరిపోయే వ్యూహాలతో టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

 

ఇక అలాంటి వ్యూహాలతోనే టీడీపీలో తిరుగులేని నేతలుగా బాబాయ్-అబ్బాయ్‌ల తలరాతని జగన్ తిరగబడేట్లు చేశారు. దివంగత ఎర్రన్నాయుడు ఫ్యామిలీ నుంచి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత పదేళ్ళ నుంచి వీరే శ్రీకాకుళం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ రామ్మోహన్ ఎంపీగా, అచ్చెన్నా మంత్రిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.

 

అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా, అచ్చెన్నా, రామ్మోహన్‌లు మాత్రం ఓడిపోలేదు. జగన్ గాలి గట్టిగా ఉన్న వీరు సులువుగా గెలిచేశారు. ఇక ఇంత వైసీపీ గాలిలో కూడా గెలిచిన ఈ ఇద్దరికీ జగన్ అదిరిపోయే నిర్ణయంతో దెబ్బ వేశారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటుకు సిద్ధమై, ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని విశాఖకు పక్కనే ఉండే విజయనగరం, శ్రీకాకుళం వాసులు ఆనందంగా స్వాగతించారు.

 

కానీ టీడీపీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది, అమరావతిలోనే రాజధానిగా ఉండాలని పోరాటాలు చేస్తుంది. ఇక దీని వల్లే శ్రీకాకుళంలో అచ్చెన్నా, రామ్మోహన్‌లకు ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. వీరు కూడా అమరావతికే మద్ధతు తెలపడంతో వ్యతిరేకిత పెరిగింది. ఈ రాజధాని ఇష్యూ వచ్చి రెండు నెలలు గడిచిన వారిపైన జనాలకు ఆగ్రహం తగ్గలేదు. ఇక ప్రజల ఆగ్రహాన్ని గమనించిన అచ్చెన్నా, రామ్మోహన్‌లు అమరావతిలో రాజధాని గురించి మాట్లాడి, సొంత జిల్లాలో సైలెంట్‌గా ఉంటున్నారు. ఎంత సైలెంట్‌గా ఉన్న రాబోయే రోజుల్లో మాత్రం వీరికి మాత్రం ఇబ్బందికర పరిస్తితులే ఉంటాయని అర్ధమైపోతుంది. మొత్తానికైతే జగన్ దెబ్బకు బాబాయ్-అబ్బాయ్‌ల తలరాత తిరగబడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: