ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకల్ పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపల్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. స్థానిక సమరం మొదలు కానుండటంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపు అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. అయితే మిగతా పార్టీలు ఎంత కష్టపడిన, అధికారంలోఉన్న వైసీపీకి మెజారిటీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాకపోతే వైసీపీకి అన్నీ జిల్లాలోనూ మెజారిటీ రావడమనేది కష్టమే అని రాజకీయ విశ్లేషుకులు భావిస్తున్నారు.

 

కొన్ని కొన్ని జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా వైసీపీ గట్టి పోటీ ఎదురుకునే జిల్లాల్లో రాయలసీమకు చెందిన అనంతపురం కూడా ఉంటుందని అంటున్నారు. మామూలుగా సీమలో వైసీపీకి తిరుగులేదు. 2014 ఎన్నికలు కావొచ్చు, 2019 ఎన్నికలు కావొచ్చు ఆ విషయం రుజువు చేశాయి. అయితే ఇదే సీమలో అనంతపురం జిల్లాలో టీడీపీకి మంచి ఓటింగ్ ఉంది. 2014లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న టీడీపీ మొన్న ఎన్నికల్లో మాత్రం చతికలపడింది.

 

టీడీపీ ఈ విధంగా చతికలపడిన, జిల్లాలో మాత్రం బలమైన కేడరే ఉంది. ఆ కేడర్ ఈసారి గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, త్వరలో అధినేత చంద్రబాబు చేసే బస్ యాత్ర కలిసి రావోచ్చని అంచనా వేస్తున్నారు. కాకపోతే టీడీపీ పోటీ ఇచ్చిన, వైసీపీకి అంతా వ్యతిరేకిత పవనాలు ఏమి లేవు. మొన్న ఎన్నికల్లో ఎలాగో జిల్లాలో ఉన్న 14 సీట్లలో 12 వైసీపీనే గెలుచుకుంది కాబట్టి, స్థానిక సమరంలో ప్రధానమైన అనంతపురం జెడ్పీ పీఠం, నగర కార్పొరేషన్‌లని వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయం.

 

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...టీడీపీ బలంగా ఉన్న ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీల్లో వైసీపీకి కాస్త ఇబ్బంది ఎదురోవచ్చని తెలుస్తోంది.  వైసీపీని మట్టికరిపించి టీడీపీ కూడా కాస్త చెప్పుకోదగిన స్థానాలే గెలుస్తుందని అంటున్నారు. మరి చూడాలి స్థానిక సమరంలో అనంతలో ఎవరిది పైచేయి అవుతుందో? 

 

మరింత సమాచారం తెలుసుకోండి: