సాధారణంగా రాజకీయాల్లో ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజం. అయితే ఒక అండర్‌స్టాండింగ్‌తో వేరు వేరు పార్టీలో ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇక అలా అరుదుగా ఉండే నేతల్లో కర్నూలుకు చెందిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్, ఆయన తనయుడు, టీడీపీ నేత టీజీ భరత్‌లు కూడా ఒకరు. అసలు 2014 ముందు వరకు కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన, టీజీ వెంకటేష్ ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

 

అయితే వెంకటేష్ ఓడిపోయినా, చంద్రబాబు ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవిచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో టీజీ తనయుడు భరత్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో భరత్ ఓడిపోవడం, రాష్ట్రంలో కూడా టీడీపీ దారుణంగా ఓటమిపాలవ్వడంతో టీజీ ప్లాన్ మార్చుకున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీలోకి వెళ్లారు. అయితే టీజీ వెళ్ళిన, భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కాకపోతే చంద్రబాబు ప్లాన్ ప్రకారమే టీజీ బీజేపీలోకి వెళ్ళారనే ప్రచారం కూడా వచ్చింది.

 

ఇక ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, టీజీ బీజేపీలోకి వెళ్ళిన తనయుడుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదనుకున్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీ ఏపీలో ఎదగాలని ప్రయత్నాలు చేస్తుందో, అప్పటి నుంచి పరిస్తితులు మారిపోయాయి. కర్నూలులో టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఓ వర్గం టీజీకి సపోర్ట్ చేస్తుంటే, మరొక వర్గం భరత్‌కు మద్ధతిస్తుంది. పైగా టీజీ బీజేపీని బలోపేతం చేసేలా ప్రయత్నాలు చేయడంతో, భరత్‌కు ఇబ్బందికర పరిస్తితులు వస్తున్నాయి. దీని వల్ల భవిష్యత్‌లో భరత్‌కు నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది.

 

కాకపోతే భరత్‌కు నష్టం జరుగుతుంది అనుకుంటే టీజీ మరో ప్లాన్‌లో ఉన్నారట, తర్వాత పరిస్తితులని బట్టి టీడీపీ పుంజుకోకపోతే, భరత్‌ని వైసీపీలోకి పంపే అవకాశాలున్నాయట. మొత్తానికైతే తనయుడుకు తిప్పలు వస్తే మాత్రం ఇలా ప్లాన్ వేసుకుని ఉన్నారట టీజీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: