ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందటే అది వైసీపీనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తన పార్టీలో జగన్ అందరికీ సమప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఒకరికి డిప్యూటీ సీఎం, మరొకరికి హోమ్ మంత్రి, ఇంకొకరికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇంకా చాలమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అటు పార్టీలో ఉన్న మహిళల ఎమ్మెల్యేలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది.

 

అయితే ఇలా వైసీపీలో మహిళలకు పెద్ద పీఠ వేస్తుంటే, టీడీపీలో మాత్రం మహిళా నేతలు అడ్రెస్ ఉండటం లేదు. చంద్రబాబు లేడీ నేతలని పూర్తిగా సైడ్ చేసేసినట్లుగా కనిపిస్తుంది. గత తన హయాంలో మంత్రులుగా ఉన్న పరిటాల సునీత, కిమిడి మృణాలిని, భూమా అఖిలప్రియ, పీతల సుజాతలకు ఇప్పుడు పార్టీలో పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పరిటాల సునీత కుమారుడు కోసం అప్పుడప్పుడు పార్టీలో కనిపిస్తుండగా, కిమిడి మృణాలిని అయితే పూర్తిగా పార్టీకి దూరమైయపోయారు.

 

అటు భూమా అఖిలప్రియ ఎప్పుడన్నా కర్నూలులో హడావిడి చేస్తున్నారు తప్ప, పార్టీలో మాత్రం కనపడటం లేదు. ఇక పీతల సుజాతకు మొన్న ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే వీరు సైలెంట్ అయితే అయ్యారో, మిగిలిన మహిళా నేతలు కూడా పార్టీలో కనపడటంలేదు. ఏదో పంచమర్తి అనురాధా తప్ప మిగతా వారు హైలైట్‌గా కనిపించిన దాఖలాలు లేవు. మొన్న తెలుగు మహిళా అధ్యక్షురాలు అయిన అనిత కాస్త మీడియాలో కనిపిస్తుంది.

 

ఇక వీరే తప్ప మిగతా మహిళా నేతలు టీడీపీకి అండగా ఉంటున్నట్లుగానీ, చంద్రబాబు వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానీ కనిపించడం లేదు. మొత్తానికైతే టీడీపీలో మహిళలకు సరైన ప్రాధాన్యత లేదనే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఏమన్నా టీడీపీలో మహిళలకు ప్రాధాన్యత వస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: