టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం...అదేంటి ఇప్పుడు ఏపీలో ఉంది వైసీపీ ప్రభుత్వం, పైగా మంత్రి పదవులు ఏమి ఖాళీ లేవు. పోనీ వైసీపీకి సపోర్ట్ తెలిపిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలని పదవికి రాజీనామా చేయించకుండా జగన్ పార్టీలో చేర్చుకోరు. మరి ఇలా ఏ విధంగా పాజిబిలిటీ లేనప్పుడు టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎలా వస్తుంది అనుకుంటున్నారా? అయితే ఆ టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎలా వస్తుందనే లాజిక్ ఒక్కసారి చూద్దాం.

 

ప్రస్తుతం వంశీ, మద్దాలిగిరిని తీసేస్తే... టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో యువ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబశివరావుకు వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ గానీ అధికారం వస్తే మంత్రి పదవి ఖాయమని ఆయన నియోజకవర్గ టీడీపీ కేడర్ చెప్పుకుంటుంది. ఎందుకంటే 2014లో తొలిసారి పర్చూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన, ఏలూరి మంచి పనితీరు కనబరిచారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, పర్చూరుని అభివృద్ధి చేశారు.

 

ఇక అలా కష్టపడటం వల్లే, 2019 ఎన్నికల్లో జగన్ గాలి ఉన్న, ప్రత్యర్ధిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్న ఓడించి రెండోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న, పని చేయడంలో వెనుకపడలేదు. నియోజకవర్గానికి పెద్దగా నిధులు అందకపోయినా, తనకు సాధ్యమైనంతవరకు పనిచేస్తున్నారు. సమస్య ఇది అని వచ్చే ప్రజలని నిరాశపరచడంలేదు. రోజూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఏదొక సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు.

 

ఇటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో ఎలాంటి లోటుపాట్లు జరిగిన, వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అధికారంలో లేము కదా అని నియోజకవర్గాన్ని వదలకుండా, తనకు సాధ్యమైన పనులు చేస్తున్నారు. అయితే ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టే, ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం మంచి పనితీరు కనబరచడం వల్ల, 2024లో గానీ టీడీపీ అధికారంలోకి వస్తే ఏలూరికి మంత్రి పదవి దక్కడం ఖాయమని టీడీపీ కార్యకర్తలు, ఏలూరి అనుచరులు చర్చలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: