ఫిబ్రవరి 16వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే... ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. అయితే నేడు ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి చూసి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 


 నోరీ  గోపాల కృష్ణ జననం: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు నోరీ  గోపాలకృష్ణ 1910 ఫిబ్రవరి 16వ తేదీన జన్మించారు. సివిల్ ఇంజనీరింగ్ లో నూరి గోపాలకృష్ణ ఎనలేని  సేవలు చేశారు. ఇతని సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1963 లో పద్మశ్రీ పురస్కారం 1972 పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 

 


 మైకెల్ హోల్డింగ్ జనం  : వెస్ట్ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రీడాకారుడు అయిన మైఖేల్ హోల్డింగ్  1954 ఫిబ్రవరి 16వ తేదీన జన్మించారు. వెస్టిండీస్ జట్టులో కీలక బౌలర్గా ఎన్నో సంవత్సరాల పాటు జట్టుకు సేవలు అందించాడు. అద్భుతమైన బౌలింగ్తో ఎంతోమంది బ్యాట్ మెన్లను  గడగడలాడించాడు మైకెల్ హోల్డింగ్. అద్భుతమైన బౌలింగ్తో ఎన్నోసార్లు జట్టుకు విజయాలను సొంతం చేశారు. మరోవైపు బ్యాట్  పట్టి పరుగుల వరద కూడా పాలించేవాడు మైకెల్ హోల్డింగ్. 

 

 డెస్మండ్ హేన్స్ జనం : వెస్ట్ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారులు నేను డెస్మండ్ హేన్స్ 1956 ఫిబ్రవరి 16వ తేదీన జన్మించారు. తన అద్భుతమైన బ్యాటింగ్తో వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగాడు. ఎన్నో రికార్డులను సైతం సృష్టించాడు. ఒక దశలో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు మరియు అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులు ఈ ఆటగాడి పేరు మీదే ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు తరఫున ఎన్నో కీలక మ్యాచ్లో తనదైన అద్భుత ప్రదర్శన చేసి జట్టును విజయతీరాలకు నడిపించాడు. జాతీయ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా  విధులు నిర్వహించారు ఈ ఆటగాడు. 

 


లగడపాటి రాజగోపాల్ జననం :  తెలుగు రాష్ట్రల్లో  ప్రముఖ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ 1964 ఫిబ్రవరి  16వ తేదీన జన్మించారు. భారత కాంగ్రెస్ అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాల్లోనే రాజకీయాల్లోకొనసాగారు ప్రముఖ పారిశ్రామిక వేత్త పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. లాన్స్  గ్రూప్ విద్యుత్ ఉత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషి చేస్తున్నాడు లగడపాటి రాజగోపాల్. ఎన్నికలపై సర్వేలు చేయడంలో అందరికంటే ముందున్నాడు లగడపాటి రాజగోపాల్. ఇకపోతే తెలంగాణ ఉద్యమం సమయంలో లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. 

 

 నిధి సుబ్బయ్య జననం  : : తెలుగు కన్నడ మలయాళం సినిమా ఇండస్ట్రీ లలో  ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నిధి సుబ్బయ్య. ముఖ్యంగా ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది ఈ అమ్మడు.ప్రస్తుతం వరుస అవకాశాలు తగ్గించుకుంటూ కెరియర్ లో దూసుకుపోతుంది. కాగా  నిధి సుబ్బయ్య 1987 ఫిబ్రవరి 16వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: