దేశంలో ఇప్పుడు బిజేపి వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి అనేది వాస్తవం. 2019లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు సహా ప్రవేశ పెడుతున్న ప్రతీ బిల్లు కూడా వివాదాస్పదంగానే మారాయి అనేది వాస్తవం. రాజకీయంగా బిజెపి బలంగా ఉంది కేవలం పార్లమెంట్ లోనే గాని ప్రజల్లో కాదు అనే విషయం కొంత కాలానికి ప్రజలకు కూడా స్పష్టత రాలేదు. బిజెపి గెలిచిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా సంబరాలు అనేవి జరగలేదు. ప్రజలు ఎక్కడ కూడా రోడ్ల మీదకు రాకపోయినా బిజెపి మాత్రం, 

 

భారత దేశం తిరిగి తన ఇంటికి వచ్చింది అనే ప్రచారం చేసుకుని ఎక్కువగా సంబరపడిది. ఇక అది పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితికి వస్తే, శివసేన ఎన్డియే నుంచి బయటకు వచ్చిన తర్వాత బిజెపితో ప్రత్యక్ష లేదా పరోక్ష స్నేహాలు చేయడానికి ఏ పార్టీ కూడా ముదుకి రావడం లేదు. ఉత్తరాది పార్టీలు బిజెపి కనపడితే పెదవులతో నవ్వి నొసటితో వెక్కిరించే పరిస్థితి ఉంది. రాజకీయంగా బిజెపిని ఏ మాత్రం ఆ పార్టీలు అంగీకరించే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పాలి. బీహార్ లో జేడియు కూడా పొత్తు నుంచి బయటకు వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. 

 

బెంగాల్ లో బలపడాలని చూసినా ప్రశాంత్ కిషోర్ లెగ్ పెట్టాడు కాబట్టి కష్టమే అంటున్నాయి రాజకీయ వర్గాలు కూడా. ఇప్పుడు ఇదిలా ఉంటే ఎన్డియేలో ఉన్న పార్టీలు గేట్లు మూసే అవకాశం ఉన్న నేపధ్యంలో బిజెపి ప్రాంతీయ పార్టీల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇన్నాళ్ళు అందరిని దేశద్రోహులుగా చూసిన కమలం పార్టీ ఇప్పుడు వాళ్ళని తమలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఉన్న పార్టీలను పోకుండా కాపాడుకోవడమే కాకుండా కొత్త పార్టీలను ఆహ్వానించాలి అని భావిస్తుంది బిజెపి. ఇది ఎంత వరకు ఫలిస్తుందో తెలియదు గాని ఈ పరిణామం మాత్రం బిజెపి ని ఇబ్బంది పెడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. రాజ్యసభలో బలం పెరగాలి అన్నా సరే బిజెపికి ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: