రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ తరువాత మంత్రులకు ఏ స్థాయి ప్రోటోకాల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంత్రుల అనుగ్రహం కోసం నాయకులు, అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియంది కాదు. అటువంటిది ఏకంగా ఓ మంత్రి కే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా ఒకటే అని అనే విషయం మరోసారి నిరూపించారు. ఇంతకీ విషయం ఏంటంటే... సనత్ నగర్ ఎమ్యెల్యే, రాష్ట్ర మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈనెల 17వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నగరంలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేయించారు. 


'వి లవ్ కేసీఆర్. మీ తలసాని శ్రీనివాస్ యాదవ్' పేరుతో అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ లలో కెసిఆర్, కేటీఆర్ తో పాటు తలసాని ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... జీహెచ్ఎంసీ పరిధిలో కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఎటువంటి నిబంధనలు ఏవీ srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఆయన అనుచరులు కానీ పాటించకపోవడంతో మంత్రికి అధికారులు జరిమానా విధించారు. అయితే తలసానికి ఈ విధంగా జరగడం ఇది మొదటిసారి ఏమీ కాదు. 


2019లో కూడా srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన అభిమానులు నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డులోని నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జిహెచ్ఎంసి అధికారులు అప్పట్లోనూ జరిమానా విధించారు. ఈ విధంగా సుమారు 25,000 చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అదే విధంగా మరోసారి జరిమానా విధించడంతో ఈ విషయం సంచలనంగా మారింది. సాక్షాత్తు మంత్రికి జరిమానా విధించిన జీహెచ్ఎంసీ అధికారుల పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంత్రికి జరిమానా విధించి సామాన్యులకు ఒక రూలు పెద్దలకు ఒక రూలు లేదు అనే విషయాన్ని ఈ చర్య ద్వారా నిరూపించారు అంటూ అభినందిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: