జనసేన పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకుని ఘోర పరాభవం మూటగట్టుకొంది. సాధారణంగా ఎవరికైనా ఎదురు దెబ్బలు సహజం. పరాజయాలను సమీక్షించుకుని... విజయానికి బాటలు వేసుకోవడం విజ్ఞల లక్షణం. కానీ పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే.. అలాంటి ప్రయత్నాలు ఏమాత్రం కనిపంచడం లేదు.

 

ఇప్పటికీ ఆయన టీడీపీ కి పార్టీ బీ లాగానే కనిపిస్తున్నారు. అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్‌ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులను ఇంకా రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసీ కూడా రైతులను రెచ్చగొట్టడం రాజకీయం అనిపించుకోదు.

 

ఇప్పటికీ పవన్ చంద్రబాబు నుంచి ప్యాకేజీలు తీసుకుని డైలాగులు చెబుతున్నాడన్న అపవాదును మోస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోందన్న అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. పవన్‌కు లోక పరిజ్ఞానం లేదని... చంద్రబాబు, లోకేష్‌ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారన్న విమర్శలున్నాయి. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందంటున్నారు కొందరు నాయకులు.

 

మరోవైపు సీఎం వైయస్‌ జగన్‌ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2500 నుంచి రూ.5000 వరకు పరిహారం పెంచారు. కానీ ఇవేవీ పవన్ పట్టించుకోవడం లేదు. సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారని విచారణలో వెల్లడైంది. ఈ అంశంపైనా పవన్ మాట్లాడకపోడవం రాజకీయంగా మైనస్ అవుతోంది. పవన్ కల్యాణ్ కాస్తా ప్యాకేజీ కల్యాణ్ అన్న విమర్శలు వస్తునే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: