ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరిపాలన లో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసినదే. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి చేసుకుంటూ దేశంలోనే మూడవ మంచి ముఖ్యమంత్రిగా ర్యాంక్ ఇటీవల సాధించారు. ఇటువంటి నేపథ్యంలో రోజు రోజుకి జగన్ క్రేజ్ పెరుగుతున్న తరుణంలో ఏపీ వైపు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చూస్తున్నారు. దక్షిణాదిలోనే బలమైన రాజకీయ శక్తిగా నాయకుడిగా అతి తక్కువ కాలంలోనే జగన్ కి జాతీయ స్థాయిలో పేరు వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

ఇదే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల ఎన్నికలలో అతి దారుణంగా బీజేపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీంతో రాజ్యసభ లో బలం తగ్గిపోయే అవకాశం ఉండటంతో వెంటనే కళ్ళు తెరిచిన బిజెపి...దక్షిణాదిలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదుగుతున్న వైసీపీ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ ని కలిసిన సందర్భంలో వైసీపీకి రెండు కేంద్ర పదవులు ఇస్తాం కలసి పనిచేయాలని ఎన్డీఏ లోకి రావాలని జగన్ ని మోడీ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ తరుణంలో జగన్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుండి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు విభజన హామీల విషయంలో స్పష్టత ఇస్తే గాని అప్పుడు చెప్పలేం అన్నట్టు జగన్ మాట్లాడినట్లు మోడీ ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

 

మోడీతో భేటీ అయిన తర్వాత ఏపీకి వచ్చిన జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటన చేపట్టారు. రెండో పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కూడా అమిత్ షా..వైయస్ జగన్ ని బీజేపీతో కలిసి పనిచేయాలని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి. అయితే అమిత్ షా ఆఫర్ కి కూడా జగన్ నో చెప్పారట. అయితే భవిష్యత్తులో కీలకమైన సమయంలో ఎందుకంటే రాజ్యసభలో త్వరలో బీజేపీకి బలం తగ్గిపోతుంది, దీంతో ఎన్డీయే కూటమిలోకి బలవంతంగా జగన్ నీ లాగాలని ప్రయత్నిస్తే సోనియా మీద తిరగబడినట్లు తిరగబడితే మాత్రం అమిత్ షా ఊరుకునే రకం మాత్రం కాదని...కచ్చితంగా జగన్ ని జైల్లో పెట్టడం గ్యారెంటీ అని పొలిటికల్ ఎనలిస్ట్ లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: