సామాన్యుడి పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. కేంద్ర అధికార పార్టీ బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కుంటూ ముందుకు వెళ్లడంలో క్రేజీవాల్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎక్కడా తన పాలనలో అవినీతి అనేది లేకుండా, కేవలం తాను ప్రవేశపెట్టిన పథకాలు, తన నిర్ణయాల అమలకు క్రేజీవాల్ చిత్తశుద్ధితో పనిచేశారని విషయం  అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. అసలు ఢిల్లీ ఎన్నికల్లో క్రేజీవాల్ ఈ స్థాయిలో విజయం సాధించడానికి కారణాలు విశ్లేషిస్తే ...


ప్రజల మనిషిగా, ప్రజలకు చెప్పింది తప్పకుండా ఆచరణలో పెట్టే వ్యక్తిగా క్రేజివాల్ ప్రజల్లో నమ్మకం సంపాదించుకో గలిగారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోకుండా, సంపూర్ణంగా నెరవేర్చేందుకు ఆయన కట్టుబడి పని చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. ఈ విషయంలో కేంద్రం తనకు సహకరించినా ... సహకరించకపోయినా తాగునీరు, విద్యుత్ పాఠశాలలు, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఇలా ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాల మీద ఆయన దృష్టి పెట్టి ప్రజల మద్దతు కూడగట్టుకొగలిగారు.

 

అందుకే మూడోసారి కూడా ఆయన ఘన విజయం సాధించగలిగారు. ఇక ఏపీలో జగన్ పరిపాలన చూస్తే దాదాపుగా ఇదే విధంగా సాగుతోంది. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఎక్కడ అవినీతి, పార్టీ లో గాని, ప్రభుత్వంలో గానీ లేకుండా జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేస్తున్నారు.


 పాఠశాలల్లో ఫుడ్ మెనూ మార్చడం దగ్గర నుంచి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ప్రజా సంక్షేమ పథకాలు ఇంటివద్దకే అందించే ఏర్పాటు జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టి నిరుద్యోగుల ఆశలు తీర్చింది. ప్రతి విషయంలోనూ పారదర్శకతను పాటిస్తూ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జగన్ తన నాలుగేళ్ల పరిపాలనలో కూడా ఈ విధంగానే చిత్తశుద్ధితో సమర్ధవంతంగా తాను పరిపాలన చేయగలిగితే ఢిల్లీ తరహా ఫలితాలు ఇక్కడ మరోసారి రిపీట్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: