తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ దక్షిణాది రాజకీయాల్లోనే బలమైన రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందే దేశ రాజకీయాలను శాసించే విధంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడు. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నాలను కెసిఆర్ ఆపడం జరిగింది. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మరొకసారి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

హైదరాబాద్ వేదికగా కొన్ని రాజకీయ పార్టీల నేతలతో కలసి ఫ్రంట్ ఏర్పాటు చేయబోయే అవకాశమున్నట్లు కెసిఆర్ కామెంట్ చేశారు. జాతీయ పార్టీల వల్ల దేశానికి ఉపయోగం లేదని గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి అంటూ సీరియస్ కూడా అయ్యారు. దేశంలో సెక్యులర్ భావాలు పోతున్నాయని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యవహరిస్తోందని పరోక్షంగా కెసిఆర్ కామెంట్ చేయటం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో దేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాలను శాసించే విధంగా కెసిఆర్ తో కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే కేసీఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ కూటమికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోతున్నట్లు సమాచారం. గతంలో ప్రశాంత్ కిషోర్ జెడియు పార్టీలో కీలకంగా ఉండేవాళ్ళు. అయితే నితీష్ కుమార్ పార్టీ నుండి ప్రశాంతి కిషోర్ ని సస్పెండ్ చేయడంతో బీజేపీ జేడీయూ మైత్రి బంధాన్ని దెబ్బ కొట్టే విధంగా ప్రశాంత్ కిషోర్ రాబోయే సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ గా తీసుకున్నారు అని బీహార్ లో వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కెసిఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ కూటమికి ప్రశాంతి కిషోర్ అండగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: