తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజకీయ పరంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అన్నది వాస్తవం. టిడిపిలో అనైక్యత మరియు ఎప్పుడెప్పుడు వైసిపికి జంప్ అవుదామా అని ఎదురు చూస్తున్నా ఎమ్మెల్యేలను పెట్టుకుని బాబు చాలా సతమతమవుతున్నాడు అనే చెప్పాలి. అయితే పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు చంద్రబాబు కి మరొక పెద్ద చిక్కు వచ్చిపడింది. జగన్ ను మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా ఎలా ఆపాలి అని తెగ ఆలోచిస్తున్న బాబుకి కొత్తగా ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ పోటు వచ్చిపడింది.

 

గత కొద్ది రోజుల ముందు చంద్రబాబు యొక్క సన్నిహితులు మరియు అతని కుమారుడు నారా లోకేష్ యొక్క స్నేహితుడు మరియు పర్సనల్ అసిస్టెంట్ మీద ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే అందులో పెద్ద మొత్తం ఏమీ బయటికి రాకపోగా చంద్రబాబు మాత్రం అకస్మాత్తుగా తనకు ఎటువంటి సమాచారం లేకుండా జరిగిన దాడులతో వణికిపోయారు. మరోపక్క ఆదాయపు పన్ను శాఖ అధికారులు లోకల్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా చాలా పకడ్బందీగా దాడులు చేయడంతో బాబుకి విపరీతమైన భయం మొదలైంది.

 

ఇక బాబు యొక్క మాజీ పిఎ శ్రీనివాస్ రావు దగ్గర కోటానుకోట్ల నల్లడబ్బు దొరకడంతో ఇప్పుడు ఐటి అధికారుల కన్ను చంద్రబాబు వైపు కి షిఫ్ట్ అయ్యింది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఐటి స్కాంలో చంద్రబాబుతో సహా మరికొంతమంది టిడిపి నాయకులు ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. వరుసగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల పై దాడులు జరుగుతూ ఉండటం మరియు దాడులు అన్నీ తిరిగి తిరిగి చంద్రబాబు వైపు వేలెత్తి చూపించడం వంటివి చూస్తుంటే బాబు త్వరలోనే జైలు ఊచలు లెక్క పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

ఇకపోతే యూనియన్ మంత్రి మరియు బిజెపి మాజీ ప్రెసిడెంట్ అమిత్ షా కూడా చంద్రబాబు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు మరియు తాజాగా జరిగిన జగన్ మీటింగ్ లో కూడా బాబు ని వదిలి లేదంటూ జగన్ కు చెప్పినట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి.  అమిత్ షా పట్టునుండి బాబు తప్పించుకుంటాడో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: