మెగాస్టార్ చిరంజీవి యొక్క రాజకీయ చరిత్ర గురించి మనందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ఆయన అప్పట్లో వైయస్సార్, కెసిఆర్ మరియు చంద్రబాబు లాంటి హేమాహేమీయులకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే పార్టీలో ఐక్యత లేకపోవడం మరియు నమ్మిన వారు అతన్ని మోసం చేయడంతో అతని పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అసలు ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా కేవలం సినిమాలపైనే దృష్టి సారించిన చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడా అని అందరిలో అనేకానేక సందేహాలు నెలకొన్నాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఒక వివరణ ఇచ్చారు.

 

 

గత కొద్ది రోజులుగా జగన్ వెంట వెంటనే రెండు సార్లు ఢిల్లీ పర్యటించగా... కేంద్ర మంత్రిత్వ విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కచ్చితంగా ఉంటారన్న విషయం మనకు అర్థం అవుతుంది. అదీ కాకుండా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే చిరంజీవి మరియు జగన్ మూడు సార్లు కలిశారు. ఒకసారి చిరంజీవి తన సైరా చిత్రాన్ని జగన్ కు చూపించేందుకు కలవగా మిగతా రెండు సార్లు వారి ఏం చర్చించుకున్నారో ఎవరికీ తెలియదు. అయితే బయట నడుస్తున్న టాక్ ఏమిటంటే చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేశారు అని.

 

 

ఇక బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ఢిల్లీ లో మోడీని కలిశారు అంటే తాము బీజేపీతో చేతులు కలిపినట్లు కాదని అలాగని మాకు వారికి ఎటువంటి శత్రుత్వం లేదని.... పార్టీ ప్రయోజనాల కోసం మరియు ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం జగన్ తీసుకుంటారని అన్నారు. అప్పుడు ఒకరు చిరంజీవి కి జగన్ రాజ్యసభ సీటును ఇవ్వనున్నారా అని అడిగితే.... జగన్ చిరంజీవి పార్టీలో చేరితే పార్టీ బలోపేతం అవుతుంది మరియు రాష్ట్రం అభివృద్ధి కూడా బాగుంటుంది అని తలిస్తే అందుకు ఎటువంటి అడ్డంకి లేదు అని చెప్పడంతో జగన్ కు అలాంటి ఉద్దేశం ఉన్నట్లేనని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక విషయమై జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ అభిమానులు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: