సాధారణంగా భూముల కొనుగోలు విషయంలో కొన్ని సందర్భాల్లో మోసాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు తెలుసుకోవటం ద్వారా భూముల కొనుగోలు సమయంలో మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు. భూమి కొనుగోలు చేసే సమయంలో ఆ భూమికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కొనుగోలు చేయాలనుకున్న స్థలాలు, భూములు కొనుగోలు జాబితాలో ఉన్నాయా..? లేదా..? చూడాలి. 
 
రిజిస్టేషన్ శాఖ వెబ్ సైట్ లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. కోర్టు వివాదంలో ఉన్న భూములు, ప్రభుత్వభూములు, ఎండోమెంట్ భూములు, అసైన్‌మెంట్‌ భూముల వివరాలన్నీ అందులో ఉంటాయి. వ్యవసాయ భూములను కొనుగోలు చేయాలనుకునేవారు భూములు అమ్మేవారికి టైటిల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ధరణి వెబ్ సైట్ లో గ్రామం, సర్వే నంబరులో వివరాలను చెక్ చేసుకొని సర్వే నంబర్ లో డీఎస్ పెండింగ్ అని ఉంటే మాత్రం భూమిని కొనుగోలు చేయకూడదు. అలాంటి భూమి కొనుగోలుకు తహశీల్దార్ సంతకం తప్పనిసరి. 
 
పట్టాదారు పాసుపుస్తకం లేని భూములను కొనుగోలు చేయకపోవడమే మంచిది. పట్టణాల్లో ఓపెన్ ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారు మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి తీసుకోవాలి. 500 గజాలకు పైగా స్థలం కొనుగోలు చేయాలనుకుంటే నగరాల్లో, పట్టణాల్లో రెరా అనుమతి తీసుకోవాలి. ఏదైనా భూమిని కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా క్రింది పత్రాలు ఉన్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. 
 
స్థల యాజమాన్య హక్కు పత్రం, రిజిస్టర్ సేల్ డీడ్, పట్టాదారు పాస్ బుక్, తాజా ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ , అండర్ టేకింగ్ ఫామ్స్ కమ్ డిక్లరేషన్ ఫామ్స్ పై యజమాని సంతకం, ధరఖాస్తు దారుని గుర్తింపు కార్డు, సర్వేయర్, ఇంజనీర్, అర్కిటెక్చర్ సంబంధిత లైసెన్స్ తో ఉన్న పత్రం, ఇంటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ పత్రాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, స్థలానికి సంబంధించిన తాజా ఫోటోలు, లొకేషన్ ప్లాన్ లకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేదో చూడాలి. ఈ పత్రాలు అన్నీ ఉంటే భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఎటువంటి సమస్యలు ఏర్పడవు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: