ప్రస్తుతం చైనా దేశంలో ప్రజలందరిని  ప్రాణభయంతో వణికిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతకమైన వైరస్ కరోనా.  చైనా దేశంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి పదిహేను వందల మందికి పైగా మృతి చెందగా 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం చైనా దేశం మొత్తం స్వీయ దిగ్బంధంలో ఉంది అనే  చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు పలు దేశాలు తమ దేశం నుంచి చైనా దేశానికి ఉన్న అన్ని సర్వీసులు పాక్షికంగా రద్దు చేసుకున్నారు. దీంతో ఇతర దేశాల నుంచి చైనాకు... చైనా నుంచి ఇతర దేశాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చైనాలో ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్ ఎక్కడ తమ దేశానికి వ్యాప్తి చెందుతుందొననని  ఇతర దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

 

 

 అయితే ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు  కలుసుకోవడానికి కూడా చైనా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఒకరిని ఒకరు కలుసుకోవడం ద్వారానే కాదు ఒకరి చేతి నుంచి మరొకరికి కరెన్సీ నోట్ల మార్పిడి ద్వారా కూడా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే చైనా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా దేశంలో కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను బయటకు వెళ్లలనివ్వరాదు అని ప్రజలందరికీ సూచించింది. కరెన్సీ నోట్లను తాత్కాలికంగా నిల్వ చేయాలి అంటూ ఆదేశించింది చైనా ప్రభుత్వం. 

 

 

 ఇదే విషయంపై చైనా పీపుల్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఫ్యాన్ యోఫై  వివరణ ఇచ్చారు. ఇప్పటికే హుబాయ్ ప్రావిన్స్ కు  నాలుగు బిలియన్ల కొత్త నోట్లను సరఫరా చేస్తామని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం బ్యాంకులో నుంచి నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని నిర్ణయించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా బ్యాంకులు మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను  నిలువ నుంచి... వాటిని యువకిరణాల ద్వారా పరిశుభ్ర పరిచిన తర్వాతే చలామణిలోకి పంపుతాము అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో నోట్ల మార్పిడి కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను మరింత ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ప్రజల నుంచి రుణాలు వసూళ్లను  కూడా వాయిదా వేసుకోవాలి అంటూ బ్యాంకులను ఆదేశించినట్లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: