ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్ళు చంద్రబాబుకి అండగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా తన మాట కాదని జై జగన్ అనడం, జగన్ ని అవకాశం దొరికినా దొరకకపోయినా పదే పదే మీడియా వేదికగా ఏదోక సందర్భం చూసుకుని మరీ పొగిడే కార్యక్రమాలు చేయడంతో పవన్ ఇక ఆయన్ను లైట్ తీసుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఎన్డిఎలో చేరినా చేరకపోయినా సరే పవన్ ని బిజెపి దూరం పెట్టడం ఖాయం గా కనపడుతుంది. 

 

బిజెపికి వైసీపీ అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యసభ లో తమకు బలంగా ఉంది కాబట్టి వచ్చే నెల కాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలను వైసీపీ నే గెలుచుకుంటుంది కనుక వైసీపీ ని దగ్గర చేసుకుంటే తమకు అన్ని విధాలుగా లాభమని బిజెపి భావిస్తుంది. పవన్ కి ఏ బలం లేదు, ఆంధ్రప్రదేశ్ లో బలపడే అవకాశం అంత కన్నా లేదు. ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బిజెపి పవన్ తో కలిసి సాధించేది అంటూ ఏది లేదు కాబట్టి ఇప్పుడు బిజెపి పెద్దలు కూడా ధర్నాలు చేయడానికి జనసమీకరణకు మినహా పవన్ వలన ఏ లాభం ఉండదు అనే అంచనాకు వచ్చేశారు. 

 

అందుకే మూడు నాలుగు నెలల నుంచి జగన్ గురించి కూడా పట్టించుకోని మోడీ, అమిత్ షా ద్వయం ఆయన్ను పిలవడం, ఇన్నాళ్ళు కలవని కేంద్ర మంత్రులు కూడా ఇప్పుడు కలవాలని చూడటం వంటివి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇప్పుడు పవన్ ని బిజెపి ఒంటరిని చేసింది. పవన్ వలన ఏ ప్రయోజనం లేదు అనే అంచనాకు వచ్చిన బిజెపి పెద్దలు దూరం పెట్టడం మొదలుపెట్టారు. అందుకే ఆయన ఇప్పుడు అమరావతిలో ఒక్కడే తిరిగి జై అమరావతి అంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: