రోజువారీ వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఎంతో పదిలంగా ఉంటుందని ఎంతో మంది నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎంత బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నప్పటికీ ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామం కోసం వెచ్చించాలి అంటూ సూచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా జిమ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకో డానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో జనాలు. దీంతో జిమ్ సెంటర్ లు  ఎక్కడ చూసినా కిక్కిరిసి పోతున్నాయి. అయితే రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు చెబుతూనే ఉంటారు. రోజు వ్యాయామం చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవని సూచిస్తూ ఉంటారు. 

 

 

 ఇక తాజాగా ఓ పరిశోధనలో వ్యాయామం  చేసే వారి కోసం మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో కిడ్నీ సమస్యల ముప్పు తక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులు ముప్పు ఉన్న వారు వారానికి 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు లేదంటే 75 నిమిషాల పాటు ఇతర వర్కవుట్ చేయడం ద్వారా కిడ్నీ సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చు అని... చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాగా తైవాన్  కు చెందిన 18 ఏళ్ల లోపు ఉన్న రెండు లక్షల మందిపై ఈ పరిశోధన జరిపారు. 

 

 

 కాగా రెండు లక్షల మంది యువకులు ఆరోగ్యం పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. వ్యాయామం చేయని వారితో పోలిస్తే... రోజు వ్యాయామం చేసేవారిలో కిడ్నీ సమస్యల ముప్పు 19 శాతం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ ఏరోబిక్ జిమ్ వర్కవుట్ చేయడం సాధ్యం కాకపోతే... రోజు గంట పాటు వాకింగ్ లేదంటే రెండు  రన్నింగ్ చేయడం ద్వారా కూడా కిడ్నీ వ్యాధులు గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: