మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా దేశంలో ఎంతో నష్టం జరిగిన విషయం తెలిసిందే. కాలుష్యం ఎక్కువ కావడంతో ఎక్కువగా వేడి గాలులు వీచి... అక్కడ ఉన్న అడవుల్లో బుష్ ఫైర్ వ్యాపించగా ... క్రమక్రమంగా ఈ బుక్ ఫైర్ కాస్త ఆస్ట్రేలియాలోని అడవులను మొత్తం దహించివేసింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల పాటు అడవిలో వ్యాపించిన బుష్పై అందినకాడికి దహించుకు పోతుంది. దీంతో ఆస్ట్రేలియా లోని అడవులు అన్నీ అగ్నికి ఆహుతై పోయి... పచ్చని అడవులు స్మశానాన్ని తలపించాయి.ఇక అడవిలోని జంతువులు అయితే లక్షలోనే మరణించాయని  ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఎంతో మంది మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

 

 

 కాగా బుష్ ఫైర్ ఆస్ట్రేలియా అడవులను అగ్నికి ఆహుతి చేస్తున్న సమయంలో లక్షల వన్యప్రాణులు చనిపోతున్న  దృశ్యాలు సోషల్ మీడియాలో అందరినీ కలిచివేసింది కూడా. అగ్నికి ఆహుతి అవ్వకుండా మూగజీవాలు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా... చివరికి కాలి బూడిద ఇవ్వక తప్పలేదు. అయితే మొన్నటి వరకు ఆస్ట్రేలియాకు పట్టిన గతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో... అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవి ప్రాంతాల్లో నివసించే వారిని అగ్నిప్రమాదాలు ప్రాణభయంతో కలవరపెడుతున్నాయి. 

 

 

 రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం... పలు మానవ తప్పిదాల వల్ల నల్లమల అడవుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మానవ తప్పిదాల వల్ల నిన్న ఒక్కరోజే ఇరవై నాలుగు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇక గత రెండేళ్ల నుంచి చూసుకుంటే నల్లమల అడవి వివిధ ప్రమాదాల్లో 90 వేల ఎకరాలలో అగ్నికి ఆహుతి అయిపోయింది. దీంతో కాలిబాటలు ప్రయాణికులను అధికారులు నిషేధించారు. ప్రమాదాలు ఇలాగే కొనసాగితే ఆస్ట్రేలియా అడవులకు పట్టిన గతే తెలుగు రాష్ట్రాలకు పచ్చతోరణం లో ఉన్న నల్లమల అడవి కూడా వచ్చే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: