వారంత ఎక్కడో పుట్టారు. ఎక్కడో పెరిగారు. కానీ ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒక చోట చేరారు.. అలా అందరు కలిసి ఆనందంగా గడుపుదామని, విహారయాత్రకు బయలుదేరారు.. కానీ వారి ఆనందాన్ని చూసి ఓర్వలేని విధి, ఈర్ష్యతో, క్షక కట్టినట్లుగా వారి ప్రాణాలను ప్రసాదంగా తీసుకుంది.. ఆనందంగా గడపవలసిన విహరయాత్ర అంతిమ యాత్రగా మార్చింది.. కర్ణాటకలో జరిగిన అత్యంత విషాదకరమైన ఈ ప్రమాదం తాలుకు విషయాలు తెలుసుకుంటే..

 

 

శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోకి రాగానే  అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రమాదానికి కారణం బస్సు అతివేగంగా వెళ్లడమే అని తెలుస్తుందట...

 

 

అలా వేగంగా వెళ్లుతున్న బస్సు బండరాళ్లను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు.. ఇక ప్రమాద సమయంలో మొత్తం 35 మంది టూరిస్టులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మైసూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. ఇక ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎందరి ప్రాణాలు ప్రమాదంలో పడ్దాయో తలుచుకుని బాధపడని వారుండరు. అందుకే దూరప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా రక్షణ చర్యలు తీసుకుని ప్రయాణిస్తే కొంతవరకైనా ఇలాంటి ప్రమాదాలు నివారించ వచ్చూ. ఎలాగో పోయిన ప్రాణాలు తిరిగి రావు, ప్రమాదం జరిగాక బాధపడే కంటే అది జరుగకుండా జాగ్రత్త పడటం మేలు... ఇక ఒక మనిషి మరణించడం అంటే ఒక కుటుంబం అనాధ అవడం అని అర్ధం.. ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో డ్రైవింగ్ చేసే డ్రైవర్లు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: