ఈ వారం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన కొన్ని విషయాలను ఇన్‌ కం ట్యాక్స్‌ అధికారులు బయటపెట్టడంతో రాష్ట్రా రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు. లోకేష్‌ సన్నిహితుడు కిలారి రాజేష్‌లపై జరిగిన దాడుల్లో దాదాపు 2000 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు.

 

దాడుల విషయంపై టీడీపీతో పాటు ఇతర రాజకీయవర్గాలన్ని మౌనం వహించటంతో ఈ పరిణామాల్లో వైఎస్సార్‌సీపీదే పై చేయిగా కనిపించింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లటం టీడీపీ వర్గాల్లో కలవరాన్ని రెట్టింపు చేసింది. జగన్‌ను స్వయంగా ప్రధాని కార్యాలయ్ ఆహ్వానించటం దాదాపు జగన్‌తో ప్రధాని గంట పాటు చర్చలు జరపటం, ఒక్క రోజు గ్యాప్‌లో మళ్లీ జగన్‌ ఢిల్లీ టూర్‌, అమిత్‌ షా సహా ఇతర కేంద్ర మంత్రులు వరుసగా అపాయింట్‌మెంట్లు ఇవ్వటం ఇలా అన్ని సందర్భాల్లో జగన్‌ తన ఏపీ పాలిటిక్స్‌లో ఈ వారం విజయం సాధించినట్టుగానే చెప్పాలి. ఇక కొత్తగా బీజేపీతో పెట్టుకున్న పవన్‌.. కేంద్రంలో బీజేపీ జగన్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తుండటంతో పునరాలోచనలో పడ్డాడు.

 

ఇప్పటికీ అమరావతి ఇష్యూను మాత్రమే సాగదీస్తున్న తెలుగు దేశం నాయకులు ఈ వారం కూడా అదే పాట పాడుతూ కాలం వెళ్లదీశారు. వైఎస్సార్‌సీపీ పై బలమైన విమర్శలు చేయటంలోనూ టీడీపీ ఫెయిల్ అయ్యింది. జగన్‌ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తప్పుపట్టినా ఏ విషయంలోనూ తమ వాదనకు బలమైన కారణాలు చూపలేకపోయారు. దీనికి తోడు అవినీతి ఆరోపణల్లో సాక్ష్యాత్తు మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడి సన్నిహితులు ఉండటంతో టీడీపీ నాయకులు కక్కలేక మింగలేక మదనపడిపోతున్నారు. ఇలా ఈ వారం జరిగిన పరిణామాలన్నింటిలో జగన్‌తో పాటు ఆయన పార్టీ నేతలు హీరోలుగా నిలిస్తే టీడీపీ పార్టీ నాయకులు జీరోలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: