ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందరికీ మెరుగైన విద్య అందేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.అంతేకాకుండా ఉన్నత విద్యలో  కీలక మార్పులు చేసేందుకు విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ ఐదు సంవత్సరాలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర విద్యాశాఖ. అయితే విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మొదటినుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

కొంత మంది ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అంటే.. కొంతమంది మాత్రం... ఒక సంవత్సరం పాటు ఎక్కువగా సమయాన్ని పెంచడం వల్ల విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతుందని ఇంకొంత మంది చెబుతున్నారు. అయితే విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్లపాటు డిగ్రీ కోర్సును పూర్తిచేసిన ప్రతి విద్యార్థికి ఒక సంవత్సరం పాటు నైపుణ్యాలు పెంపొందించేలా అప్రెంటిస్షిప్ ఉంటుందని... ఇదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా నాలుగు సంవత్సరాల విద్యా  పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

 

 అయితే ఈ నిర్ణయం వల్ల కొంత మంది విద్యార్థులకు లాభం చేకూరితే  ఇంకొంతమందికి మాత్రం నష్టం వాటిల్లుతుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డిగ్రీ విద్యార్థులు మూడు సంవత్సరాలు ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగు విద్యను పూర్తి చేసిన అనంతరం సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ చేయడం వల్ల నైపుణ్యం లేని విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని అదే సమయంలో నైపుణ్యం ఉన్న విద్యార్థులకు సంవత్సరం పాటు సమయం వృధా అవుతుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. అప్రెంటిస్షిప్ ను తప్పనిసరి చేయకుండా విద్యార్థులు అప్రెంటిస్షిప్ ఎంచుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: