ఒక అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఆలోచన పదిమందికి మార్గాన్ని చూపిస్తుంది.. ఇలా ఆలోచించకుండా కష్టాలు వచ్చాయని, కళ్లను కన్నీటితో తడిపేసుకుంటూ ఉంటే జీవితం నిస్సారంగా మారిపోతుంది.. ఎన్నో ఉలిదెబ్బలు తింటేగానీ శిల శిల్పంగా మారదు, అలా కష్టాలకు ఓర్చుకుని గుడిలో చేరి అందరిచేత దైవంగా పూజింప బడుతుంది. బంగారం కూడా అంతే నిప్పు సెగ తగిలిన తర్వాతే ఆ కొలిమిలో కరిగి, అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది..

 

Image result for kotiigroupofventures

ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు తన జీవితంలో అనుభవించిన ఓ యువకుడు ఇప్పుడు పది మందికి  ఆదర్శంగా మారి, తన ఆలోచనలతో ఉన్నత స్దానానికి చేరుకుని, తానూ ఎదుగుతూ, తనతో పాటుగా పదిమందికి నీడనిచ్చే పచ్చని చెట్టులా మారారు.. అతనే కోటి రెడ్డి గారు.. గుడివాడ దగ్గర్లోని జనార్దనపురంలో  మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈయన అందరిలాగే కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం ఒక కార్మికునిలా శ్రమించాడు.. కర్షకునిలా సేద్యం చేసాడు.. దాని ఫలితమే  కోటి గ్రూప్‌ ఆఫ్‌ వెంచర్స్‌..  

 

Image result for kotiigroupofventures

 

ముగ్గురు ఉద్యోగులతో మొదలైన ఈ కంపెనీ నేడు ఐదొందల మంది పైచీలుకు చేరుకుంది. మొత్తం పద్నాలుగు కంపెనీలకు అనుబంధంగా మారింది... ఇదే కాకుండా నేటికాలంలో పెరిగిన టెక్నాలజీ సామాన్యుడికి ఏవిధంగా ఉపయోగపడనదని గ్రహించిన కోటిగారు సమాజానికి పనికొచ్చే రంగాల్లో కృషి చేయాలని సంకల్పించి, ఆ దిశగా అడుగులు వేస్తూ, అగ్రిటెక్‌, ఎడ్యుటెక్‌, ఫైనాన్స్‌టెక్‌, హెల్త్‌టెక్‌, క్వాలిటీటెక్‌, కన్‌స్ట్రక్షన్‌ టెక్‌... ఇలా ప్రతి దాంట్లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీని అందిస్తు, ఈయన కంపెనీ పేరు మీద 140 పై చిలుకు ఇంటర్నేషనల్‌ పేటెంట్స్‌ సాధించారు..

 

 

సంపాదించిదంతా తమ తరాలకోసం దాచుకుంటున్న ఈ రోజుల్లో ఒక సామాన్యుడు, తన స్వశక్తితో ఎదిగి, తనకు వచ్చిన దాంట్లో 33 శాతం ఉద్యోగులకు, 33 శాతం సమాజానికి, 33 శాతం వారి కోసం ఉపయోగించుకుంటు, సేవా ఫౌండేషన్‌, కోటి ఫౌండేషన్‌ల ద్వారా మూడు వేల మందికి పైగా పిల్లలకు విద్యను అందించడం నిజంగా అభినందనీయం.. ఇలా దిన దినంగా, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, తన వ్యక్తిత్వంతో శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి మన కోటిగారని చెప్పక తప్పదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: