స్వర్గానికి వెళ్ళాలనే కోర్క అందరికీ ఉంటుంది కాని మరణించదానికి ఎవరు సాహసించరు అన్న సామెత ఉంది. అదేవిధంగా ధనవంతులు అవ్వాలనే కోరిక ప్రతివ్యక్తికి ఉంటుంది. అయితే చాలామంది దానికి కావలసిన కార్యాచరణ చేపట్టరు. డబ్బు సంపాదించాలి అంటే పీనాసిగా ఉండనవసరం లేదు. మన కోర్కెలు అన్నీ తీర్చుకోకుండా వాయిదా వేసుకోవలసిన అవసరం లేదు.


కేవలం మనకు మనం ఎవరి స్థాయిలో వారు ధనవంతులుగా మారాలని స్థిర నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. కష్టపడి నెలకి 30 వేలు సంపాదించే వ్యక్తి కూడ రోడ్డు మీద అయాచితంగా ఒక వంద రూపాయల నోటు కనిపిస్తే ఎంతో ఆనందపడిపోతు ఉంటాడు. దీనికి కారణం మనిషిలో ఉండే ఆశించే తత్వం.


చాల మంది సంపదను ఆశిస్తారు కానీ వాంచించరు. అయితే ఈ సంపద పట్ల ఉండే ఆశ రోజురోజుకి అందరిలో బాగా పెరిగిపోతూ ఉండటంతో లాటరీలు కొత్తకొత్త స్కీమ్ లు అనేకం మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి. అందువలనే ఆశ చాల బలహీనమైనది చంచల స్వభావం కలది అని అంటారు. ఆశ వెంటనే ఫలితం రావాలని కోరుకుంటుంది.


అయితే ఘాఢమైన కోరిక మనలో ఉండే సోమరితనాన్ని పోగొట్టి మనలను చలాకీగా ఉండేడట్లు చేయడమే కాకుండా మనలోని బద్దకాన్ని హరించి వేస్తుంది. అందువల్లనే ఘాఢమైన కోరిక ఉన్న వ్యక్తి మాత్రమే సంపన్నుడుగా కాగలుగుతాడు. ఒక వ్యక్తి ముందుగా ధనవంతుడుగా మారాలి అంటే తనకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరం అవుతుందో ముందుగానే నిర్ణయించుకున్న విషయాలను ముందుగా ఒకచోట వ్రాసుకుంటే మనకు స్పష్టత ఏర్పడి కష్ట పడాలి అన్న ఆలోచన వస్తుంది. అప్పుడే మనోబలం స్థిర చిత్తం మనకు తెలియకుండానే మనలో ఏర్పడి మనలను ధనవంతులు మారుస్తాయి. కలలుకన్నా ఎక్కువ జ్ఞాపకాలనే గుర్తుకు చేసుకునే వాడు జీవితంలో ధనవంతుడు కాలేడు. అదేవిధంగా జీవితంలో రాజీపడే వ్యక్తి కూడ ఐశ్వర్య వంతుడు కాలేదు. అందుకే లక్ష్య నిబద్ధత ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: