ఒక మనిషి జీవితంలో పైకి రావాలంటే అన్నికంటే ముఖ్యంగా ఉండవలసింది మనకు అనుకున్నది సాధించాలి అనే కృషి, పట్టుదల. అయితే అవి మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా చేసి చూపించి, ఆ సమయంలో తనకు ఉన్న కొద్దిపాటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, తన తెలివి తేటలు, శ్రమతో ఇంతింతై వటుడింతై అన్నట్లు, నేడు ఏకంగా 14 కంపెనీలకు ఎండి గా కోట్ల రూపాయల టర్నోవర్ తో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు కోటి గారు. మొదట ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ గా తన జీవితాన్ని ఆరంభించిన కోటి గారు, ఆ తరువాత ముగ్గురు సిబ్బందితో తన కార్యకలాపాలను ఆరంభించారు. అక్కడి నుండి శ్రమనే ఆయుధంగా చేసుకుని, రేయనకా పగలనకా కష్టపడి, మెల్లగా అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఎదురైనా కష్ట, నష్టాలను భరిస్తూ ముందుకు సాగారు. 

 

అయితే ఆయన అతి తక్కువ సమయంలోనే ఇంత అత్యున్నత స్థాయికి చేరడానికి కేవలం శ్రమ, కృషి, పట్టుదల, కార్యదీక్ష మాత్రం కారణం అనుకుంటే పొరపాటే. ఆయన సక్సెస్ లో ఇక్కడ ఒక గొప్ప పరమ రహస్యం దాగి ఉంది. ఎవరైనా వ్యక్తిగా మెల్లగా దినదినాభివృద్ధి చెందుతూ పైకి ఎదుగుతున్న సమయంలో కొంతైనా గర్వం అనేది ఉంటుంది. అయితే అదే ఆ వ్యక్తి ఎదుగుదల, అలానే ఎదిగిన తరువాత ఆయన జీవిత గమనంపై కొద్దిగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ కోటి గారి విషయంలో ఆయనను సక్సెస్ ని మరింతగా వరించడానికి కారణం, ఆయన నిగర్వి కావడమే. తన జీవితంలో చూసిన ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు ఎదిగే సమయంలో గుర్తు చేసుకుంటూ, తన వలె ఇతరులు ఎటువంటి సమస్యలకు లోను కాకూడదని, సంస్థలోని సభ్యులను ఒక కుటుంబం మాదిరి చూడడం మొదలెట్టారు. మెల్లగా ఉద్యోగులను సాధారణ ఎంప్లాయ్స్ వలె కాకుండా కుటుంబ సభ్యుల మాదిరిగా చూడడం, వారికి మరిన్ని అవకాశాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటివి చేసేవారు. 

 

మనం ఎదగడంతో పాటు మనవారు కూడా ఎదిగితేనే మనకు నిజమైన గెలుపు లభించినట్లు అనే భావన వారిలో కలగడం, ఆపై తన ఆదాయంలో 33 శాతం పలు రకాల సేవాకార్యక్రమాలు నిర్వహణకు అందించడంలోనే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తూనే ఉంటాడు అనడానికి నిజమైన నిదర్శనం. ఇక నేడు ఏకంగా 14 రకాల రంగాలకు చెందిన ఇంటర్నేషనల్  సంస్థలకు వ్యవస్థాపకుడిగా ఆయన వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఆయన తన ఉద్యోగులను తనతో సమానంగా చూడడమే ఆయన సక్సెస్ సీక్రెట్. ఒక వస్తువు ఒక్క అమ్మకానికి నిజమైన పునాది నమ్మకం అయితే, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలకు నిజమైన పునాది అతని వ్యక్తిత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నిజమైన మనిషి యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం అనుకుంటే, ఆ పదాన్ని కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించిన మంచి మనసున్న వ్యక్తి కోటి గారు. ఇక నేడు కోటి ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఆ సంబరాలను సంస్థ సభ్యులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: