మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఆడపిల్ల బయట కనిపిస్తే చాలు లైంగిక దాడికి యత్నిస్తున్నారు  కామంతో కళ్లు మూసుకుపోయిన మ్రుగాళ్ళు. దీంతో ఎక్కడి కెళ్ళినా మహిళలకు రక్షణ కరువవుతోంది. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇక కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామందుల తీరులో మార్పు మాత్రం రావడం లేదు. రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిర్మూలించేందుకు దిశ అనే వినూత్న చట్టానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

 

జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన దిశ చట్టం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ భద్రత గా మారిపోయింది. దిశా చట్టం కింద ఇప్పటికే ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా  తాజాగా మరో కేసు నమోదైంది. రెండు కేసులు ఒకే ప్రాంతానికి చెందినది కావడం గమనార్హం.  రెచ్చిపోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి బస్సు దిగి వెళుతున్న యువతి పై అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి దిగాడు. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు 112 కి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే మొన్నటికి మొన్న దిశా  చట్టం కింద నమోదైన మొదటి కేసు కూడా ఏలూరులోని నమోదు కావడం గమనార్హం. 

 

 వివరాల్లోకి వెళితే... ఏలూరు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన యువతి ఓ షాపులో పని చేస్తుంది. శనివారం విధులు ముగించుకొని రాత్రి 11 గంటల బస్సు దిగి ఇంటికి నడుస్తుంది. అదే సమయంలో నవాబ్ పేట కు చెందిన రూపా మురళి అనే యువకుడు యువతి వెంటపడి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పక్కకు లాగి లైంగిక దాడికి యత్నించాడు ఆ యువకుడు. ఇక ఆ యువకుడి తీరుతో భయపడిపోయిన బాధిత యువతి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న కార్మికులందరూ హుటాహుటిన అక్కడికి చేరుకొని మురళిని  పట్టుకున్నారు. బాధితురాలు వెంటనే 112 నెంబర్కి ఫోన్ చేయగా... నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక నిందితుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: