అద్రుష్టం బాగోకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది. ముఖ్యంగా చావు విషయానికి వస్తే ఎప్పుడు ఎం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఎటు నుంచి ముంచుకు వస్తుందో ఏ విధంగా వస్తుందో అంచనా కూడా వేయలేరు. అసలు అది అంచనా వేసేది కూడా కాదు. సపోటా గింజ గొంతులో ఇరుక్కుని ఒక బాబు ప్రాణాలు కోల్పోయాడు అంటే చావు ఎలా వస్తుందో చుడండి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని మీడియా పుణ్యమా అని ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 

 

ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఇక పోలీసుల విషయానికి వస్తే విధి నిర్వహణలో వాళ్ళు ఎలా ప్రాణాలు కోల్పోతారో కూడా చెప్పలేము. చేసే ఉద్యోగమే అలాంటిది. మంచి చేయడానికి వెళ్లి కూడా ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరినో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణా రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన చూస్తే చావు ఇంత సిల్లీ గా ఉంటుందా అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. విధి నిర్వహణకు వెళ్ళిన పోలీసు అధికారి మరణం ఆశ్చర్యంగా ఉంది. 

 

అంగనూర్ లోని మానేరు వంతెనపై నుంచి కారు పడింది. ఈ కారు ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న సదరు వ్యక్తి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. సరే అది ఒక విషాదం అనుకునే లోపే ఇంకో ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ పిట్టగోడ కూలిపోయి వంతెనపై నుంచి పడిపోయి తీవ్ర గాయాల పాలు అయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకువెళ్ళగా ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనితో చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: