“మేము కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది. ఎన్డియేలో చేరినా చేరవచ్చు” ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీ బొత్సా చేసిన ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది అనే చెప్పాలి. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న వైసీపీ నేతలకు కూడా ఎం జరుగుతుంది అనేది అర్ధం కాలేదు. ఆయన మాట్లాడిన తర్వాత మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నానీ, అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ అబ్బే అదేం లేదు అన్నారు. 

 

అలాంటిది నిజంగా ఏమైనా ఉంటే సిఎం జగన్ నుంచి ప్రకటన వస్తుంది అంటూ ఎవరు మాట్లాడినా అది పార్టీ మాట కాదంటూ బొత్సాను ఏకి పారేశారు సాటి మంత్రులే. సరే అసలు ఆయన ఎందుకు అన్నారు...? వీళ్ళు కవర్ చేసారు సరే... జగన్ ఢిల్లీ వెళ్తే ఆ మాట అనాల్సిన అవసరం బొత్సా గారికి ఏమొచ్చింది...? ఆయన ఏమీ సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు. ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించిన అనుభవం ఉన్న మంత్రి. వైఎస్ హయాంలో ఆయన చెప్పిందే వేదం. అలాంటి మంత్రి గారు ఇప్పుడు ఇలా ఎందుకు అన్నారు అనేది అర్ధం కాలేదు. 

 

అయితే ఆయన ఇప్పుడు జగన్ మీద కోపంగా ఉన్నారంట. ఎందుకో తెలుసా...? రాజధాని మారుతుందో లేదో బోత్సాకు జగన్ స్పష్టంగా చెప్పడం లేదట. దానికి తోడు బొత్సా సత్యనారాయణ రాజధాని మీద చాలా ఆశాలుపెట్టుకున్నారు. మారిపోతుంది అని నమ్మేశారు. మారుతుందో లేదో పక్కన పెడితే ఆర్ధికంగా ఆయనకు విశాఖ ఆయువు పట్టు. ఇప్పుడు మారకపోయినా ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే బొత్సా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కూడా ఆయన నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. దానికి తోడు బొత్సా కాస్త దూకుడుగా ఉన్నారని జగన్ కళ్ళెం కూడా వేసారు. ఈ కోపాలు అన్ని మనసులో పెట్టుకుని ఆయన ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చు అంటున్నారు. అసలు కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే రాజధాని మారడం పెద్ద కష్టం కాదు అనేది కూడా బొత్సా అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: