ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కీలక నేతలు గా చక్రం తిప్పిన వాళ్ళల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఒకరు. ఏ మాటకు ఆ మాట గాని ఆర్ధికంగా రావు గారు బలంగా ఉన్న నేపధ్యంలో సార్వాడు ఏ పార్టీ లో ఉన్నా సరే అధినేతల నుంచి మంచి గుర్తింపు కూడా వస్తూ ఉంటుంది. ఆయన సొంత జిల్లా విశాఖ లో కూడా కాస్త బలం ఎక్కువే. కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక ఫాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే కాబట్టి, విశాఖ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ పరిధి లో ప్రభావం చూపిస్తూ ఉంటారు. 

 

ఎన్నిక కు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే గంటా ఇప్పుడు విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. అంత వరకు బాగానే ఉంది గాని... ఇప్పుడు ఆయన టీడీపీ ని వీడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఆగకుండా ఇప్పుడు ఒక ప్రచారానికి తెర లేచింది. చిరంజీవి కి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. జగన్ ఆయనకు రాజ్యసభ ఇస్తారని సోషల్ మీడియా తో పాటు ప్రధాన మీడియా కూడా కథనాలు ప్రచురించింది. 

 

ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి వైసీపీ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన కు గంటా కు మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకు అన్నయ్యా అంటూ ఆయన తోనే ఉన్నారు కూడా గంటా. అందుకే కాంగ్రెస్ లో విలీనం చేయగానే మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు గనుక చిరంజీవి వైసీపీలోకి వెళ్తే ఆయనతో పాటుగా గంటా కూడా వెళ్ళే అవకాశం ఉందని, అందుకే గంటా బిజెపిలోకి వెళ్ళకుండా ఇన్ని రోజులు ఆగారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: