డిసెంబర్ 15 రాత్రి జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో విద్యార్ధులపై జరిగిన దాడికి సంబంధిన వీడియోని విడుదల చేసారు. Jamia Coordination Committee” అనే ట్విట్టర్ ఖాతాలో ఢిల్లీ పోలీసులు విద్యార్ధులపై దాడి చేసిన వీడియోని బయటపెట్టారు. తాజాగా బయటకు వచ్చిన ఈ సీసీటీవీ ఫూటేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఎంఏ / ఎంఫిల్ సెక్షన్ మొదటి అంతస్తులోని లైబ్రరీలోకి పోలీసులు ప్రవేశిస్తున్నట్లు చూపిస్తుంది. సిసిటివి ఫుటేజీలోని టైమ్ ప్రకారం... సాయంత్రం 6:08 గంటలకు పోలీసులు ప్రవేశిస్తారు. 

 

అనంతరం నిరాయుధులు అయిన విద్యార్ధులపై లాఠీలతో దాడి చేసినట్టు ఉంటుంది. "ఈ సంఘటన వీడియో బయటపడింది ... మేము దానిని తెలుసుకున్నాము మరియు ఈ విషయంపై దర్యాప్తు చేస్తాము" అని క్రైమ్ స్పెషల్ సిపి ప్రవీర్ రంజన్ ను పేర్కొన్నారని జాతీయ మీడియా పోస్ట్ చేసింది. విద్యార్థులపై పోలీసుల దాడిపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ విశ్వ విద్యాలయంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై కూడా విద్యార్ధులు నిరసనలు వ్యక్తం చేసారు. 

 

స్థానిక౦గా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా సమీపంలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నాలుగు బస్సులను తగలబెట్టడంతో పోలీసులు క్యాంపస్‌ లోకి ప్రవేశించారు. విద్యార్ధులు చెప్పిన దాని ప్రకారం చూస్తే... క్యాంపస్ ని ముట్టడించిన పోలీసులు, టియర్ గ్యాస్ షెల్స్‌ను పేల్చారని ఆరోపిస్తున్నారు. ఇక గాయపడిన వారిని వైద్యానికి కూడా అనుమతించలేదు. పోలీసులు దాడి చేసినప్పుడు లోపల 50-60 మంది విద్యార్థులు లోపల ఉన్నారని విద్యార్థులు తెలిపారు. ఇక పోలీసులు కిటికీలు పగలగొట్టి లోపలికి వచ్చినట్టు అక్కడి విద్యార్ధులు వివరించారు. ఇక పోలీసుల దాడి నుంచి తప్పించుకోవడానికి గాను చాలా మంది విద్యార్ధులు అక్కడి నుంచి పారిపోయారట. అయినా సరే పోలీసులు వారిని వెంటపడి దాడి చేసారు.

https://twitter.com/Jamia_JCC/status/1228772837583753216?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1228772837583753216&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Findia%2Fjamia-students-release-cctv-footage-of-delhi-police-assaulting-students-in-library-on-december-15-2502597.html

మరింత సమాచారం తెలుసుకోండి: