పిల్ల‌లు ఆడుకోవడానికి బొమ్మల కోసం చూస్తున్నప్పుడు అన్నీ ప్లాస్టిక్‌ బొమ్మలే కనిపించాయి. ప్ర‌స్తుతం వైద్యులు తెలిపే వివ‌రాల ప్ర‌కారం ప్లాస్టిక్ వాడ‌కం అంత‌గా మంచిది కాదు అని అంటుంటారు. ప్లాస్టిక్ క‌వ‌ర్లు వాడ‌కం, ప్లాస్టిక్ బాక్స్‌లు, ఇలా ప్ర‌తి ప్లాస్టిక్ వ‌స్తువు పైన నిషేధం ఉంటున్న విష‌యం తెలిసిందే. 'ప్లాస్టిక్‌ బొమ్మలు వద్దు అని అంటుంటారు అంద‌రూ.  మా  చిన్నప్పుడు కొయ్య బొమ్మలే కొనిచ్చేవాళ్ళు అంద‌రూ. పాలకాయ (ఆటవస్తువు)తో మాకు బొమ్మలు కొనివ్వడం ప్రారంభించేవాళ్ళు. మీరు కూడా చెక్కబొమ్మలే కొనండి' అంటూ పెద్ద‌వాళ్ళు సూచనలు ఇచ్చారు. వారు చెప్పిన బొమ్మల కోసం ఎన్నో చోట్ల వెతికినా దొరకలేదు.

 

చాలామంది చిన్నారులకు ఆరోగ్యకరమైన బొమ్మలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఇప్పుడు చాలామంది ఆ బిజినెస్‌లోకి కూడా దిగుతున్నారు. దాంతో రకరకాల చెక్క బొమ్మల గురించి రీసెర్చ్‌ చేశాం. కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్న బొమ్మల గురించి, వాటి తయారీ గురించి వివరాలు సేకరించి మ‌రీ కొత్త కొత్త స్టాల్స్‌ని పెడుతున్నారు. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఇలాంటి బొమ్మ‌లు చాలానే ఉంటున్నాయి.  ఎన్నో అందమైన, ఆరోగ్యకరమైన బొమ్మలు ఉన్నాయన్న విషయం తెలిసింది. దాంతో పిల్లలకు కావల్సిన బొమ్మలను వారికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మార్కెట్‌లో జ‌రుగుతుంది. 

 

ప్లాస్టిక్‌ అన్నింటిలో విస్తరించింది. మార్కెట్‌లో లభించే చిన్నారుల బొమ్మలు కూడా ప్లాస్టిక్‌తో చేసినవే. వీటిని తయారు చేయడానికి ఏడాదికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఒక సర్వేలో స్పష్టమైంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అనారోగ్యకరమైన వస్తువులను పిల్లల చేతికి ఇస్తున్నారు. పర్యావరణ హిత, ఆరోగ్యకరమైన బొమ్మల తయారీకి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎంతో మంది కళాకారులకు ఉపాధి లభిస్తుంది.  లక్క, కొయ్య బొమ్మలు, అలంకరణ వస్తువులు తయారుచేసే వందల కుటుంబాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: