జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ బీజేపీ పార్టీ మిత్రపక్ష పార్టీ అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కొని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడిందని చెప్పారు. ఢిల్లీ ప్రజల అవసరాలను గుర్తించి సీఎం కేజ్రీవాల్ పథకాలను అమలు చేశారని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఓట్లను డబ్బుతో కొనలేదని పవన్ చెప్పారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో జనాల కోసం పని చేసింది కాబట్టే విజయం సాధించిందని అన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలాగే తాను కూడా డబ్బుల్లేని రాజకీయాలే చేస్తానని పవన్ అన్నారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే జనాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం డబ్బుతో రాజకీయాలను చేస్తోందని డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసేవారు ప్రజల సమస్యలను పట్టించుకోరని అన్నారు. 
 
జనసేన పార్టీ ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తుందని ధన రాజకీయాలకు జనసేన దూరమని పవన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ భవిష్యత్తులో తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని పవన్ అన్నారు. తాను డిగ్రీ కూడా చదవలేదని సమాజాన్ని మాత్రం నిత్యం చదువుతానని పవన్ చెప్పారు. 
 
పార్టీ నడపటం కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నానని కుళ్లు కుతంత్రాలు వెన్నుపోటు రాజకీయాలు ఉంటాయని తనకు తెలుసని పవన్ అన్నారు. ప్రజలు పోలింగ్ బూత్ లకు 2,000 రూపాయల నోటు ఇస్తే మాత్రమే వచ్చి ఓటేయడం దారుణం అని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు పెట్టడం కాదని సర్పంచ్ కింద నిధులు ప్రతి గ్రామంలో ఉంచగలిగితే అదే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అని పవన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: