"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అన్నారు మన పెద్దలు. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణంలోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అది ప్రకృతి పరంగా కావచ్చూ, గురు ముఖంగా కావచ్చూ. ఇకపోతే చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ, తప్పి పడిపోతే తల్లి పట్టుకుంటుంది.. ఆ అడుగులు సరిగ్గా వేయడం ప్రారంభించాక, తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా ఉండటానికి జ్ఞానాన్ని గురువు అందిస్తారు.

 

 

ఒకప్పుడు గురువుకు ఉన్న విలువ నేటికాలంలో లేదని తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే గురువంటే గుండు సూదిలా తీసేస్తున్నారు.. ఇక "మాతృదేవోభవ,  పితృదేవోభవ, ఆచార్య దేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది.

 

 

ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. కాని కొందరు విద్యార్థులు గురువులను ఏ మాత్రం గౌరవించకపోగా వారిపై దాడులకు పాల్పడుతున్నారు. చివరికి హత్యచేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇకపోతే మహారాష్ట్రలోని వాద్రా జిల్లా దరోడా గ్రామంలో ఇలాంటి దారుణమే జరిగింది. గ్రామంలోని పాఠశాల విద్యార్థులే తమ ఉపాధ్యాయురాలిపై పెట్రోల్‌పోసి నిప్పింటించారు. వెంటనే పాఠశాల సిబ్బంది మంటలను ఆర్పేసి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

 

 

ప్రస్తుతం 67 శాతం కాలిన గాయాలతో ఆ ఉపాధ్యాయురాలు నరకయాతన అనుభవిస్తున్నది. వాద్రాలోనే వారం క్రితం ఒక కాలేజీ అధ్యాపకురాలిని విద్యార్థులు తగులబెట్టిన ఘటనను మరువకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కరమైన విషయం. ఇక సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  సంఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు..

 

 

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే కూడా  సీరియస్‌గా స్పందించారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించి నిందితులకు త్వరగా శిక్షపడేలా చేయాలని ఆదేశించారు. కాగా, తల్లిదండ్రుల పెంపకంలో లోపమే విద్యార్థుల్లో ఇలాంటి చెడు స్వభావం పెరగడానికి కారణమవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: