పోరాడితే పోయేదేమీ లేదు.. పేద‌రికం త‌ప్ప .. అనే మాట‌ను అక్ష‌రాలా నిజం చేస్తున్నారు స‌రిప‌ల్లి కోటిరెడ్డి. తాను ఎంచుకున్న మార్గంలో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా జీవించాల‌నే త‌ప‌న‌.. ఆయ‌న‌ను పేద‌రికం నుంచి ప్ర‌పంచ స్థాయికి చేరేలా చేసింది. కృష్ణాజిల్లా లోని జ‌నార్థ‌న‌పురం అనే ప‌ల్లెటూర్లోని వ్య‌వ‌సాయ కుటుంబంలో స‌రిప‌ల్లి మ‌ల్లేశ్వ‌ర‌మ్మ‌, న‌ర్సిరెడ్డి దంప‌తుల‌కు జ‌న్మించిన కోటిరెడ్డి.. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మెచ్చే సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా ఎదిగిన వైనం.. నిజంగానే పేద‌రికంలో పుట్టినా.. ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌లేనిది ఏమీ లేద‌నే మాట వాస్త‌వమ‌ని అంగీక‌రించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి!  నేటి సాంకేతిక యుగానికి స‌రైన స‌దుపాయాల‌ను అందిస్తూ.. త‌న‌దైన విభిన్న శైలిలో దూసుకుపోతున్నారు కోటిరెడ్డి.

Image result for kotii group of ventures

నిజానికి ఒక విజ‌యం అందుకున్న త‌ర్వాత ఒక వ్య‌క్తికి వ‌చ్చే గుర్తింపు పెద్ద‌లెక్క‌లోది కాదు. కానీ, ఆ విజ‌యం అందుకోవ‌డం కోసం చేసే ప్ర‌య‌త్నాన్ని గుర్తించ‌డ‌మే కావాల్సింది. కోటిరెడ్డి జీవితాన్నే తీసుకుంటే.. ప్ర‌స్తుత టెక్ ప్ర‌పంచంలో ఆయ‌న దూసుకుపోతున్న తీరు న‌భూతో న‌భ‌విష్య‌తి. ప‌దోత‌ర‌గతి అర్హ‌త‌గా ఆయ‌న మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సాధించ‌డం, త‌ర్వాత డెల్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక‌వ్వడం.. ఇవ‌న్నీ అతి త‌క్కువ కాలంలోనే జ‌రిగాయంటే ఆయ‌న ఎంత స్పీడ్‌గా ఎదిగారో అర్థం చేసుకోవ‌చ్చు.

 

పెద్ద పెద్ద కంపెనీల్లో పేరు తెచ్చుకోవ‌డం, త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఓ సంస్థ ఉండాల‌ని త‌పించ‌డం, దీనికిగాను ఆయ‌న చేసిన కృషి.. ప్ర‌పంచం మెచ్చేస్థాయికి ఎద‌గ‌డం వంటివి నిజంగా మెచ్చుకోవాల్సిన అంశాలే. అయితే, నూటికి 70 మంది ఇప్ప‌టికీ దేశంలో పేద‌లుగానే ఉన్నారు. అలాంటి ఓ కుటుంబం నుంచి ఇలాంటి ర‌త్నం వెలుగులోకి రావ‌డ‌మే రికార్డు. ఎత్తుప‌ల్లాల జీవితంలో అనేక అవ‌మానాల‌ను ఎదుర్కొని భాషా స‌మ‌స్య‌ను కూడా ఛేదించి.. ప్ర‌పంచాన్ని మెప్పించ‌డం అంత ఈజీకాదు.  ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన‌ర్ఘ‌ర‌త్నంగా ముందుకు వ‌చ్చారు.

Image result for kotiigroupofventures

ముందు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న సాంకేతికంగా అడుగులు వేస్తున్నారు. అలాగే మాన‌వాళి ప్ర‌ధానంగా ఎదుర్కొంట‌న్న అనారోగ్య స‌మ‌స్య‌పై పోరాటం చేసేందుకు కూడా ఆయ‌న ప్ర‌యోగాలు చేస్తూ ఇప్ప‌టికే కొన్నింట్లో స‌క్సెస్ అయ్యారు. ప్ర‌తి విష‌యంలోనూ భ‌విష్య‌త్తును ప్రామాణికంగా తీసుకుని ఆయ‌న చేస్తున్న ఆలోచ‌న‌లు పేద‌రికంపై గెలిచిన ఓ యువ‌కుడి క‌థ‌గానే కాకుండా.. నేటి త‌రానికి, మున్ముందుత‌రాల‌కు కూడా ఎంతో ఆద‌ర్శం. పోరాడితే పోయేదేమీలేదు.. భ‌విష్య‌త్తును ఆదేశించ‌డం త‌ప్ప‌! అని నిరూపిస్తున్న కోటిరెడ్డి జీవితం నుంచి ఒక్క పేజీ అయినా ఒంట‌బ‌ట్టించుకుంటే.. కొంద‌రిలో అయినా మ‌ర్పు వ‌స్తుందేమో క‌దా...!

మరింత సమాచారం తెలుసుకోండి: