దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా మాట్లాడిన ఆయన ఎన్నికల్లో పోటీ విషయాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. డబ్బులు లేకుండా గెలవడానికి రాజకీయాల్లో ఉదాహరణలు ఉన్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ లో డబ్బులు ఇచ్చి గెలవలేదు కేవలం ఆలోచనా విధానంతో గెలిచారని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్య చేసారు. నాకు ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా మైనస్ లేవు అంటూ పవన్ వ్యాఖ్యలు చేసారు.  

 

తనపై ఎన్నికల్లో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ మాదిరిగా ఆక్వా వ్యాపారం లేదని అన్నారు. స్వశక్తి మీద బతకడానికి తనకు కేవలం సినిమాలే ఉన్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. అదే విధంగా తన ఎన్నికల్లో పోటీ గురించి పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను ఈజీగా గెలిచే సీటు తాడేపల్లిగూడెం అన్నారు. నేరస్తులను నడిపే రాజకీయ పార్టీలను చూసి తాను ఏదో చెయ్యాలని భావించి పార్టీ పెట్టా అంటూ వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా, తనను కులం చూసి కాదు సిద్దాంతాలను చూసి ఇష్టపడాలి అంటూ వ్యాఖ్యానించారు. 

 

రెండు కులాల మధ్య రాష్ట్రం విచ్చిన్నమవుతుంది అన్న మాట వాస్తవమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆయన. బాధ్యతగల రాజకీయాలు చెయ్యాల్సిన అవసరముందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడుతూ,  తనకు రెండు చోట్ల పోటీ చేయడం ఇష్టం ఉండదు అని కాని పార్టీ నేతలు చెప్పడంతో రెండు చోట్ల పోటీ చేశా అన్నారు. ముందు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చెయ్యాలి అనుకున్నా అన్న ఆయన ఈసారి తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తా అన్నారు. గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చెయ్యాలని అన్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అవినీతిని మంగళగిరి సభలోనే తాను లేవనెత్తా అంటూ పవన్ గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: