అధికారం, ఎన్నికల్లో పోటీ, పోటీ చెయ్యాలి అనుకున్న స్థానాలు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో ఎక్కువగా వినపడుతున్న వ్యాఖ్యలు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనకు అధికారం మీద వ్యామోహం లేదూ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద జనసేన కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ అనేది ఇప్పుడు అసలు అనవసరమైన అంశం. అదే విధంగా ఆయన ఓటమి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రాజకీయంగా జనసేన పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. 

 

ఆ విధంగా అడుగులు వెయ్యాలి, తాను ఏదైతే పోరాడాలి అనుకున్నారో దాని మీద పోరాటం చెయ్యాలి గాని ఎప్పుడో మూడేళ్ళకు, నాలుగేళ్ళకు వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడటం అనేది హాస్యాస్పదమే అవుతుంది. అమరావతి పోరాటంలో గాని మరొక పోరాటం లో గాని తన పోటీ ప్రస్తావన గాని రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారో గాని చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సమస్యల నుంచి ప్రజలు బయటకు రావాలి అంటే తన వంతుగా ఎం చెయ్యాలి.

 

లేకపోతే ప్రజల్లోకి తాను చేసే లేదా చేయబోయే పోరాటాల గురించి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేది చెప్పాలి గాని, అనవసర రాజకీయ ప్రకటనలు అనేది ఎంత మాత్రం ఆయనకు గాని ఆయన పార్టీ కార్యకర్తలకు గాని అవసరం లేదు. పవన్ ఇక నుంచి అయినా ఆ కబుర్లు ఆపాలి అనేది జనసేన కార్యకర్తల అభిప్రాయం. ఇక ఆయన ప్రకటనలు చూసి తటస్థులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గట్టిగా మాట్లాడితే పవన్ కు ఏ మాత్రం బలం లేదు. ఆయనకు అధికారంలోకి వచ్చే సామర్ధ్య౦ ఎంత మాత్రం లేదు. ఈ విషయం జనసేన కార్యకర్తలే చెప్పి, చంద్రబాబుకో లేక జగన్ కో ఓటు వేసారు. కాబట్టి పవన్ ఇక నుంచి అయినా సరే వాటి నుంచి బయటకు వస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: