ఏదైనా రంగంలో విజ‌యం సాధించ‌డం అంటే.. అదేమీ అంగ‌ట్లో అమ్మే స‌రుకుకాదు.. ఇలా వెళ్లి అలా జేబు లో పెట్టుకుని తెచ్చుకునేందుకు.. దానికి చాలా ప‌రిశ్ర‌మ చేయాలి. ఎంతో కృషి చేయాలి.అంతే రేంజ్లో ప‌ట్టు దల కూడా చాలా ముఖ్యం. ఎన్ని దెబ్బ‌లు త‌గిలితే.. శిల శిల్పంగా మారుతుందో.. విజ‌య‌ప‌రంప‌ర‌ను చేరు కునేందుకు ఎవ‌రైనా అన్నిప‌రిశ్ర‌మ‌లూ ప‌డాల్సిందే. ఈ క్ర‌మంలో అనేక ఉత్థానాలే కాదు.. ప‌త‌నాలు కూడా ఎదుర‌వుతాయి. వీట‌న్నింటి ఎదిరించి అనుకున్న‌ది సాధించ‌డ‌మే కాకుండా మ‌రిన్ని ఆవిష్క‌రణలతో ముందుకు సాగుతున్నారు కోటి ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు, ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం కోటిరెడ్డి స‌రిప‌ల్లి.

 

రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌గారు వీధి దీపాల కింద కూర్చుని చ‌దువుకున్నార‌ని.. పుస్త‌కాల్లో చ‌దివి మ‌నం ఆశ్చ‌ర్య‌పోయాం. కానీ, మ‌న‌క‌ళ్ల‌ముందు..కేవ‌లం రూ.750 కి ఓ చోట ప‌నిచేసిన కుర్రాడు.. నేడు రూ.750 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేరుకుని, ప‌రుగులు పెట్టే కంపెనీని ఏర్పాటు చేశారంటే.. ఇంకెంత ఆశ్చ‌ర్య‌పోవాలి! అది కూడా వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చి .. కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసి త‌ర్వాత అనూహ్య‌ రీతిలో కంప్యూట‌ర్ ప్రోగ్రాంను నేర్చుకుని త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సాధించిన కోటిరెడ్డి.. విజ‌య‌ప‌రంప‌ర‌ను మ‌రోసారి త‌న‌దైన రీతిలో లిఖించార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

 

ఒక కృషి.. ఒక ప‌ట్టుద‌ల ఉంటే ఆశ‌యం ఎంత‌టిదైనా.. ఎలాంటిదైనా సాధించ‌డం సాధ్య‌మేన‌ని నిరూపిం చారు. కోటి గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్ ద్వారా నిత్య నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుకు సాగారు కోటిరెడ్డి. భార‌త్ హెల్త్ కేర్ లేబొరేట‌రీస్‌, ఈగుడి, డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్ కో సిస్ట‌మ్ లిమిటెడ్‌, డీజెడ్ పే ప్రైవేట్ లిమిటెడ్‌, ఇండియా హెరాల్డ్ గ్రూప్ ప‌బ్లిష‌ర్స్ లిమిటెడ్‌, స్నాగ‌ర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, కోటి ఫౌండేష‌న్‌, సేవాఫౌండేష‌న్‌, క్రౌడ్‌ బ్ల‌డ్ . ఆర్గ్‌, భార‌త్ ఇన్నోవేష‌న్ ల్యాబ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థ‌ల‌ను స్థాపించి, త‌న‌దైన వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ఈ ప్ర‌పంచానికి చేరువై.. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో ముందున్నారు కోటిరెడ్డి. కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు! అన్న నినాదాన్ని చేత‌ల్లో నిరూపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: