ఎంత ఎదిగామ‌న్న‌ది ఎంత‌ముఖ్య‌మో.. ఎంత‌గా ఒదిగి ఉన్నామ‌న్న‌దీ అంతే ముఖ్యం. ఎంత సంపాయించు కున్నామ‌న్న‌ది ఎంత ముఖ్య‌మో.. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌కు ఎంతో కొంత సాయం చేయ‌డం అన్న దీ అంతే ముఖ్యం. ఈ సూత్రాన్ని మ‌న‌సా వాచా అమ‌లు చేస్తున్నారు.. కేజీపీ గ్రూప్ అధినేత కోటిరెడ్డి స‌రిప ల్లి. తాను న‌డిచిన దారిలో తాను ఎన్ని అవాంతాలు ఎదుర్కొన్న‌దీ ఆయ‌న మ‌రిచిపోలేదు. నేడు ప్ర‌పంచ స్థాయి టెక్ దిగ్గ‌జంగా ఎదిగినా.. తాను న‌డిచిన మార్గాన్ని ఆయ‌న ఇప్ప‌టికీ గుర్తు పెట్టుకున్నారు.

Image result for kotiigroupofventures

ఈ క్ర‌మంలోనే పేద‌లు, బ‌డుగుల‌కు తాను సంపాయించుకున్న రూపాయిలో ఆయ‌న సాయం చేస్తూ.. సేవ‌ల‌కు కేరాఫ్‌గా మారారు. కోటిరెడ్డి ఫౌండేష‌న్ ద్వారా కేజీపీ గ్రూప్ అధినేత సేవా కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించారు. `వ‌సుధైక కుటుంబం` అనే స్లోగ‌న్తో కోటిరెడ్డి తాను సంపాయించే దానిలో 33 శాతం సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తున్నారు. విద్యార్థుల‌కు ఉచితంగా పుస్త‌కాలు, స్కాల‌ర్ షిప్పులు ఇవ్వడంతో పాటు పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వాటిని అభివృద్ధి చేయ‌డంలోను ముందున్నారు.

 

Image result for kotii group of ventures

అదే స‌మ‌యంలో వైద్య శిబిరాల‌ను నిర్వ‌హిస్తూ. పేద ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం ఖ‌ర్చు పెడుతున్నారు. తాను సంపాయించుకున్న‌ది త‌న‌కే చెందాల‌నే చింత‌న‌ను ప‌క్క‌న పెట్టి.. మాతృభూమికి ఏదైనా చేయాల‌నే త‌ప‌న‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే క్రౌడ్ బ్ల‌డ్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను స్థాపించారు.


దీని ద్వారా దేశంలోని పేద‌ల‌కు సాయం చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. తాను సంపాయిస్తున్న కోట్ల లో 33 శాతం నిధుల‌ను ఉద్యోగుల‌కు కేటాయించిన కోటిరెడ్డి.. మ‌రో 33 శాతాన్ని త‌న‌కు కేటాయించుకున్నా రు. మిగిలిన మొత్తంలో 33 శాతం నిధుల‌ను కేవ‌లం సేవా కార్య‌క్ర‌మాల‌కే కేటాయించారు.



అదే స‌మ‌యం లో సామాజిక స్పృహ‌తో కూడా ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రంలో అక్ష్య‌రాస్య‌త‌ను పెంచే క్ర‌మంలో సేవ ఫౌండేష‌న్ పేరుతో పాఠ‌శాల విద్య‌ను పిల్ల‌ల‌కుచేరువ చేసేలా ముఖ్యంగా పేద‌ల‌కు విద్య చేరువ అయ్యేలా కృషి చేస్తున్నారు. కోటి ఫౌండేష‌న్ ద్వారా.. అనేక సేవ‌ల‌ను విస్త‌రించారు. వృద్ధులు, విక‌లాంగుల‌కు సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి క‌ల్ప‌న‌, శిక్ష‌ణ వంటి రంగాల్లోనూ దృష్టి సారించారు. మొత్తంగా చూస్తే.. సొంత లాభం మానుకుని పొరుగువాడికి సేవ చేయ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతున్నార‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: