సాంకేతిక యుగంలో పోటీ ఏదైనా ఉంటే అది ఆవిష్క‌ర‌ణ‌ల‌తోనే!  నేడున్న‌ట్టుగా రేప‌టి సాంకేతిక ప్ర‌పంచం ఉండాల‌ని శాసించ‌లేం. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ సాంకేతిక యుగం మారిపోతుంది. మారుతున్న కాలంతోపాటు  అనేక స‌మ‌స్య‌లు కూడా ముందుకు వ‌స్తున్నాయి. వీటికి ప‌రిష్కారాలు ఏమిటి?  సాంకేతిక‌త అయితే, అందు బాటులోకి వ‌స్తున్నా.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం మాత్రం త‌క్కువ‌గానే ఉంటోంది. అయితే, ఇలాంటి స‌మ‌స్య‌ల ను కూడా చిటికెలో తీరుస్తూ.. త‌న‌దైన శైలిలో సాంకేతిక యుగ సైనికుడిగా అద్భుత ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముం దుకు సాగుతున్నారు కోటిరెడ్డి స‌రిప‌ల్లి.

Image result for kotiigroupofventures

ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక‌తలో రాబోయే మార్పుల‌ను ముందుగానే అంచ‌నావేయ‌డం కోటిరెడ్డికి వెన్న‌తో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఇంటి నుంచి ఆఫీస్ వ‌ర‌కు, డెస్క్ టాప్ నుంచి లాప్ టాప్ వ‌ర‌కు. స్మార్ట్ ఫోన్ నుంచి ఐప్యాడ్ వ‌ర‌కు ఇలా అన్ని సాంకేతిక సాధ‌నాల తీరుతెన్నుల్లో రాబోయే ప‌రిణామాల‌ను, మార్పులను ముందుగానే ఊహించి చెప్ప‌డం కోటిరెడ్డికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న చెప్పే ఆవిష్క‌ర‌ణ‌ల్లో కోన్ని కీల‌క‌మైన‌వి చూస్తే.. అచ్చ‌రువొంద‌క త‌ప్పదు. ప్ర‌స్తుతం ప్ర‌తిఒక్క‌రికీ చేరువైన అలెక్సాలో రాబోయే కాలంంలో జ‌రిగే మార్పుల‌ను ఆయ‌న ముందుగానే ఊహించారు.

Image result for kotiigroupofventures

ప్ర‌స్తుతం లివింగ్ రూమ్ వ‌ర‌కు ప‌రిమిత‌మైన అలెక్సా.. రాబోయే రోజుల్లో వాష్ రూమ్‌లోనూ త‌న‌దైన సేవ లు అందించ‌నున్న‌ద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. గీజ‌ర్‌లో వాట‌ర్ వేడి నుంచి అనేక విష‌యాల‌ను ఇక‌పై మ న‌తో పంచుకునేందుకు జ‌ర‌గ‌బోయే మార్పుల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. అదేవిధంగా పెద్ద పెద్ద మ‌హాన గ‌రాల్లో ఏర్ప‌డుతున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను త‌ట్టుకునేందుకు ఎయిరో స్పేస్ సౌల‌భ్యం అందుబాటులో కి వ‌చ్చే విష‌యాన్ని ముందుగానే ఊహించ‌డం గొప్ప‌విష‌య‌మే క‌దా! ఇలా అనేక మార్పులు, చేర్పులు సాంకేతికంగా ఎంతో ప్ర‌యోజ‌నాన్ని చేకూరుస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. నేటి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఇవి మ‌రింత మేలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: